English   

వీర రాఘవుడికి అరవింద హ్యాండిచ్చిందా..?

Pooja-Hegde
2018-10-08 16:31:59

మరో నాలుగు రోజుల్లో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ‘అరవింద సమేత వీరరాఘవ’ విడుదల కాబోతోంది. సినిమాపై భారీ అంచనాలున్నాయి. వాటిని అందుకుంటామనే కాన్ఫిడెన్స్ ఎంటైర్ యూనిట్ లో కనిపిస్తోంది. కాకపోతే ప్రమోషన్స్ లో కూడా ఓ మైనస్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అదే హీరోయిన్లు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లున్నారు.కానీ ఇప్పటి వరకూ ఒక్కరూ ప్రమోషన్స్ లో లేరు. రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్నా ఇప్పటి వరకూ ఎన్టీఆర్, త్రివిక్రమ్ మాత్రమే ప్రమోషన్స్ చేస్తున్నారు. అటు డైలీ పేపర్ప్, టివి ఛానల్స్ రెండిటికీ వీళ్లిద్దరే కనిపిస్తున్నారు. పైగా అన్ని క్వశ్చన్స్ రిపీటెడ్ గా కనిపిస్తున్నాయి. అందులో కొత్తదనం ఏమీ కనిపించడం లేదు. నిజానికి ఓ సినిమా గురించి హీరో అండ్ డైరెక్టర్ ఏం చెప్పగలరో అంత వరకే యాంకర్స్ అడుగుతున్నారు. వాళ్లూ చెబుతున్నారు. కనీసం ఈ బోర్డమ్ ను తగ్గించడానికైనా.. ప్రమోషన్స్ కు కాస్త కలర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కలర్ హీరోయిన్లతో మాత్రమే వస్తుందనేది అందరికీ తెలుసు. 

ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటించగా.. ఈషా రెబ్బా మరో హీరోయిన్. అయితే ఈ ఇద్దరిలో పూజాకే ఎక్కువ స్పేస్  అండ్ క్రేజ్ ఉంది. కానీ తను మాత్రం ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించడం లేదు. నిజానికి తనిప్పుడు వరుసగా మూడు సినిమాలు చేస్తోంది. వీటిలో ఒకటి బాలీవుడ్ మూవీ కూడా ఉంది. ఈ సినిమా షూటింగ్ కే స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి అటెండ్ అయింది. ఇక ప్రమోషన్స్ అంటే కుదురుతుందా అనుకోవచ్చు. కానీ హీరోయిన్ లేకుండా ప్రమోషన్ ఏమంత బావుండదు. కనీసం తను ఒక్క రోజైనా ప్రమోషన్స్ కు కేటాయించి ఓ జనరల్ ఇంటర్వ్యూ చేసినా అదే అన్ని ఛానల్స్ కు ఇవ్వొచ్చు. కనీసం తను లేకపోయినా విలన్ జగ్గూ భాయ్ ఉణ్నాడు.. ఇతర ప్రధాన పాత్రల్లో ఉన్న ఆర్టిస్టులూ ఉన్నారు. వారినైనా ప్రమోషన్స్ లో అదనంగా కూర్చొబెట్టొచ్చు. మరి అయినా అలా చేయడం లేదంటే.. హీరో, దర్శకుడే ప్రమోషన్స్  చేయాలని ఫిక్స్ అయ్యారేమో అనుకోవచ్చు.. 

More Related Stories