English   

ఎన్టీవోడు రిక్షా ఎక్కితే ఎట్టుంటాదో తెలుసా.. 

NTR-biopic
2018-10-08 17:33:26

ఎన్టీఆర్ కు సైకిల్ కు ఎంత అవినాభావ సంబంధం ఉందో అందరికీ తెలుసు. దానికి మరో వీల్ తగిలించి ఇప్పుడు రీల్ ఎన్టీఆర్ హల్చల్ చేశాడు. యస్ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘‘ఎన్టీఆర్’’ బయోపిక్ షూటింగ్ సందర్భంగా బాలయ్య ఇలా రిక్షా సవారీ చేస్తూ హల్చల్ చేసి ఆకట్టుకున్నాడు. అన్నగారు వేటగాడు సినిమాలోని ఆకుచాటు పిందె తడిసే పాటలో ఉపయోగించిన లాంటి హ్యాట్ పెట్టుకుని పూర్తిగా వైట్ అండ్ వైట్ లో ఆయనలా రిక్షాపై వెళుతోంటే అభిమానులు కన్నార్పకుండా చూస్తున్నారు. అంటే రిక్షా తొక్కేది బాలయ్యే అయినా ఆయన ఉన్నది ఎన్టీఆర్ గెటప్ లో. రిక్షా తొక్కుతున్నది ఎన్టీవోడే అన్నమాట. 

సినిమా ఇండస్ట్రీలో బౌన్సర్స్ అక్కర్లేని ఏకైకా బిగ్గెస్ట్ స్టార్ బాలకృష్ణ. యస్.. ఆయనంటే ఎంతోమందికి అభిమానం. కొన్నిసార్లు అది హద్దులు దాటితే ఆయనే చూసుకుంటారు. అందుకే ఇంత ధైర్యంగా పబ్లిక్ లో రిక్షా తొక్కుకుంటూ హ్యాపీగా వెళుతున్నాడు. ఇక ప్రస్తుతం ‘ఎన్టీఆర్’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొన్నటి వరకూ సంక్రాంతికి వస్తుందనుకున్న సినిమాను సడెన్ గా రెండు భాగాలుగా చేసి ఆశ్చర్యపరిచాడు దర్శకడు క్రిష్. ఫస్ట్ పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ టైటిల్ తో జనవరి 9న విడదలవుతోంటే.. రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ టైటిల్ తో జనవరి 24న విడుదల కాబోతోంది. మొత్తంగా ఈ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో ఓ కొత్త చరిత్రకు నాంది పలకబోతున్నాడు బాలయ్య. 

More Related Stories