English   

పండగ మూడ్ లో శర్వానంద్, సాయి పల్లవి

Padi-Padi-Leche-Manasu
2018-10-08 18:26:50

కొన్ని కాంబినేషన్స్ కంటెంట్ తో పనిలేకుండా ఆసక్తిని కలిగిస్తాయి. అలాంటిదే శర్వానంద్, సాయిపల్లవి కాంబినేషన్. వీరికి తోడు దర్శకుడు హను రాఘవపూడి కూడా లవ్ స్టోరీస్ లో ఎక్స్ పర్ట్ అనిపించుకున్నాడు. లేదా కాస్త కొత్తగా ట్రై చేస్తాడు అనే పేరుంది. అందుకే ముందు నుంచీ ఈ ముగ్గురి కలయికలో వస్తోన్న ‘పడిపడి లేచెను మనసే’ సినిమాపై కాస్త ఇంట్రెస్ట్ ఉంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ మూవీ కూడా పీరియాడికల్ డ్రామాగా తెలుస్తోంది. అంటే కొన్నేళ్ల క్రితం జరిగిన ప్రేమకథగా అని. మొత్తంగా గత కొన్ని రోజులుగా ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీకి సంబంధించిన కొన్ని స్టిల్స్ తప్ప పెద్దగా అప్డేట్స్ లేవు. ఈ క్రమంలో మూవీ టీజర్ ను విడుదల చేసేందుకు రెడీ అయింది టీమ్.

ఈ నెల 10 పడిపడి లేచెను మనసే టీజర్ ను ఉదయం 9.30గంటలక విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో పాటు శర్వా అండ్ సాయిపల్లవి ఇద్దరూ కలిసి హోలీ పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా ఉన్న స్టిల్ విడుదల చేశారు. ఆకట్టుకునేలా ఉన్న ఈ స్టిల్ సినిమా మూడ్ ను కూడా తెలియజేస్తుంనుకోవచ్చు. అంటే సినిమా అంతా కలర్ ఫుల్ గానో లేదంటే ఓ పండగ జోష్ లా ఉంటుందనుకునేలా సింబాలిక్ గా ఈ పోస్టర్ విడుదల చేసినట్టు అర్థమౌతోంది. మొత్తంగా ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తోన్న పడి పడి లేచెను మనసే సినిమా డిసెంబర్ లో విడుదల కావొచ్చు.. 

More Related Stories