English   

అరవిందుడు సెన్సార్ పూర్తి చేసుకున్నాడు

NTR-Aravinda-Sametha
2018-10-08 18:43:25

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ‘అరవింద సమేతవీరరాఘవ’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇక ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటికే భారీ అంచనాలున్నఈ సినిమాపై మాగ్జిమం పాజిటివ్ టాక్ ఉంది. ఎన్టీఆర్, త్రివిక్రమ కాంబినేషన్ లో వస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో అటు క్లాస్, ఇటు మాస్ ను ఆకట్టుకునేలా అన్ని అంశాలతో నిండిన కంప్లీట్ కమర్షియల్ ప్యాక్ గా వస్తోన్న ఈ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఎన్టీఆర్ కు ఈ మూవీ కొత్త రికార్డులు తెస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. 

అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కెరీర్ లో ఇప్పటి వరకూ ఎన్నడూ లేనంత భారీ రేట్స్ కు సినిమా థియేట్రికల్ రైట్స్ ను అమ్మేశారు. ఇక పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో జగపతిబాబు క్రూరమైన విలన్ గా నటించాడు. ట్రైలర్ లో జగ్గూ లుక్ కు చాలామంది ఫిదా అయిపోయారు. ఎన్టీఆర్ పూర్తిగా ఫస్ట్ టైమ్ రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడుతోన్న సినిమా ఇది. ఇంతకు ముందు ఆయన తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడిన బాద్ షా మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు సీమ స్లాంగ్ తో ఆకట్టుకోబోతున్నాడు.. 

హారిక హాసిని బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మించిన ఈ మూవీకి సెన్సార్ నుంచి యూ / ఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ తో పాటు సినిమాకు మంచి ప్రశసంలు కూడా వచ్చినట్టు టాక్. ఇప్పటి వరకూ వచ్చిన సీమ బ్యాక్ డ్రాప్ ఫ్యాక్షనిస్ట్ కథలకు ఈ సినిమాకు పూర్తిగా వైవిధ్యం ఉందని.. ఖచ్చితంగా కాంబినేషన్ పై ఉణ్న అంచనాలను ఈ సినిమా భారీగా నిలబెడుతుందనే టాక్ కూడా తెచ్చుకుంది. మరి అదే నిజమైతే ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే. 

More Related Stories