English   

అఖిల్ ను నలిపేస్తున్నారుగా

Akhil-Akkineni
2018-10-08 19:19:17

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో యంగ్ స్టర్ అఖిల్. కుర్రాడు చూడ్డానికి బానే ఉన్నా.. ఎందుకో లక్ చిక్కలేదు. మొదటి సినిమా అఖిల్ అట్టర్ ఫ్లాప్ అయితే.. తర్వాత చేసిన హలో ఓకే అనిపించుకుంది. కానీ యంగ్ స్టర్ గా ఫ్యామిలీ ఫ్యాన్స్  అంచానలను మాత్రం ఇప్పటి వరకూ అందుకోలేకపోయాడు.. ప్రస్తుతం తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దీనికి రీసెంట్ గా ‘మజ్ను’ అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. దీనికి క్రేజీ రెస్పాన్స్ అయితే రాలేదు కానీ.. మొత్తంగా నాగార్జున చేసిన హిట్ సినిమా టైటిల్ కాబట్టి ఓకే అనుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మాగ్జిమం షూటింగ్ పూర్తయింది.

అయితే సినిమా రిలీజ్ డేట్ విషయంలో అఖిల్ కు సరైన టైమ్ దొరికేలా లేదు. నిజానికి ఈ డిసెంబర్ లో అనుకున్నారట. కానీ అప్పటికి వీళ్లు అనుకున్న డేట్ లో చాలా సినిమాలున్నాయి. దీంతో జనవరి అనుకున్నారు. బట్.. సంక్రాంతికి అఖిల్ కు ఛాన్స్ వస్తుందనుకోలేం. ఇక రిపబ్లిక్ డే అనుకుంటే అప్పుడు చాలా పెద్ద సినిమాలే ఉన్నాయి. అందులో బాలయ్య నటిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ రెండో  భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఉంది. అటు బాలీవుడ్ నుంచి రెండు భారీ సినిమాలున్నాయ్. 

దీంతో అఖిల్  సినిమా ఇటు 2018లో మిస్ అవుతుంది. అలాగే ఫస్ట్ మంత్ ను కూడా క్యాష్ చేసుకునే అవకాశం లేదు. ఇక మిగిలింది. ఫిబ్రవరి. ఇప్పటి వరకూ  ఆ టైమ్ కు పెద్ద సినిమాలేవీ అనౌన్స్ చేయలేదు. దీంతో ఈ దర్శకుడి ఫస్ట్ మూవీ వచ్చిన టైమ్ కే విడుదల చేసే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంటే వెంకీ అట్లూరి ఫస్ట్ మూవీ ‘తొలిప్రేమ’ ఈ యేడాది ఫిబ్రవరి 9న వచ్చింది కదా. ఇప్పుడు మజ్ను కూడా అదే డేట్ లో లేదా ఫస్ట్ వీక్ లో వచ్చేయొచ్చు అంటున్నారు. ఏదేమైనా పాపం కుర్రాడిని రిలీజ్ డేట్స్ మధ్య బాగా నలిపేస్తున్నారు. 

More Related Stories