English   

ప్రభాస్ కొత్త సినిమా టైటిల్?

Prabhas Next With Director Radha Krishna Movie Gossip Title
2018-10-09 08:26:46

బాహుబలి తర్వాత మరో సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకుంటున్నాడనే కారణంగా ప్రభాస్ పై ఫ్యాన్స్ కూడా కాస్త గుర్రుగానే ఉన్నారు.. అయితే ఇది ప్రేమతో కూడిన కోపమే లెండి. వారి కోపాన్ని అర్థం చేసుకున్న డార్లింగ్ వెంటనే నెక్ట్స్ మూవీ కూడా మొదలుపెట్టాడు. ప్రస్తుతం సాహో సినిమాతో ఫుల్ బీజీగా ఉన్నాడు ప్రభాస్. ఇది ప్రొడక్షన్ లో ఉండగానే జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమా ఓపెనింగ్ చేశాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ పీరియాడికల్ డ్రామా అని ముందు నుంచీ చెబుతున్నారు. 1980ల కాలంలో సాగే ప్యూర్ లవ్ స్టోరీ అంటున్నారు. ఆ టైమ్ లో జరిగిన కథగా వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు చాలా వరకూ మన కథలన్నీ పీరియాడిక్ గా మారిపోతున్నాయి. ఇదీ అలాగే జరిగిందని చెప్పలేం కానీ.. లేటెస్ట్ గా ప్రభాస్, రాధాకృష్ణ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు.

‘‘అమూర్’’... ఇదే ఆ కొత్త టైటిల్. అమూర్ అంటే అర్థం ఏంటీ.. అసలు ఇలాంటి పదం తెలుగులో ఉందా అని ఆలోచిస్తున్నారు కదూ. మీకంత శ్రమ అక్కర్లేదు. ఆ టైటిల్ తెలుగు కోసం పెట్టింది కాదు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ వాల్డ్ వైడ్ గా బాగా పెరిగింది కదా. అందుకే ఇప్పుడతని కొత్త సినిమాలన్నీ వివిధ దేశాల్లోనూ విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇందులో ఈ కొత్త సినిమాను కూడా ఫ్రెంచ్ లో విడుదల చేయబోతున్నారు. అక్కడ ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టారన్నమాట. మరి ఫ్రెంచ్ లో అమూర్ అంటే తెలుగులో ఏంటో తెలుసా.. ‘ప్రేమ’. సో మాగ్జిమం తెలుగులో ప్రభాస్ కొత్త సినిమాకు ఈ టైటిలే ఉండొచ్చు అనుకోవచ్చు. ఇదే టైటిల్ తో గతంలో వెంకటేష్, రేవతి జంటగా వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మళ్లీ ఆ టైటిల్ ప్రభాస్ పెట్టుకుంటే ఖచ్చితంగా లవ్ స్టోరీ అంటున్నారు కాబట్టి మంచి టైటిల్ గానే మిగులుతుంది.

More Related Stories