English   

త్రివిక్ర‌మ్ ప‌ర‌దా వేసుకున్నాడంటున్న ఎన్టీఆర్.

NTR-Trivikram-srinivas
2018-10-09 11:49:38

అదేంటి.. త్రివిక్ర‌మ్ ప‌ర‌దా వేసుకోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును.. ఇప్పుడు ఈ మాట‌లు ఎన్టీఆరే అన్నాడు. ప్ర‌తీ మ‌నిషిలోనూ ఇంకో మ‌నిషి ఉంటాడు. కాక‌పోతే వాడు అవ‌స‌రం అయిన‌పుడు మాత్ర‌మే బ‌య‌టికి వ‌స్తుంటాడు. బ‌య‌ట మాత్రం ఇంకో మ‌నిషి ఎప్పుడూ ముసుగు వేసుకుని ఉంటాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇదే చెబుతున్నాడు. త్రివిక్ర‌మ్ లో మ‌న‌కు పైకి క‌నిపించేది ఒక‌డు.. లోప‌ల ఇంకొక‌డు ఉన్నాడ‌ని చెబుతున్నాడు ఈ హీరో. మ‌నం బ‌య‌ట ఉన్న స‌ర‌దా మ‌నిషిని మాత్ర‌మే చూస్తున్నామ‌ని.. లోప‌ల చాలా సీరియ‌స్ మ‌నిషి ఒక‌రు ప‌ర‌దా వేసుకుని ఉన్నాడ‌ని గుర్తు చేస్తున్నాడు.
 
అర‌వింద స‌మేత సినిమా చేస్తున్న‌పుడు ఈయ‌న్ని ఇంత‌కాలం మ‌నం త‌క్కువ‌గా అంచ‌నా వేసాం అనిపించింది అని చెప్పాడు జూనియ‌ర్. అస‌లు త్రివిక్ర‌మ్ లో ఇంత లోతైన మ‌నిషి ఒక‌రు ఉన్నారా అని ఆశ్చ‌ర్యం వేసింద‌ని.. ఇన్నాళ్లూ దాన్ని ప‌రదా వేసి క‌ప్పేసి ఉంచాడ‌ని చ‌మ‌త్క‌రించాడు ఎన్టీఆర్. ఆయ‌న‌తో ప‌ది నిమిషాలు మాట్లాడితే క‌చ్చితంగా ఆ విష‌యం అంద‌రికీ అర్థ‌మైపోతుంద‌ని చెప్పాడు యంగ్ టైగ‌ర్. స‌ర‌దా స‌ర‌దాగా మాట్లాడుతూ న‌వ్వుతూ క‌నిపిస్తూ లోప‌ల మాత్రం పేల‌డానికి సిద్ధంగా ఉన్న అగ్నిప‌ర్వ‌తాన్ని పెట్టుకుని ఉన్నాడంటున్నాడు ఎన్టీఆర్. మ‌రి త్రివిక్ర‌మ్ లో నిజంగానే అంత ఫైర్ ఉందా.. మ‌రి అర‌వింద స‌మేత‌లో అది పేల‌నుందా..? ఏమో చూడాలిక‌..!

More Related Stories