English   

బాల‌య్య‌ను చంపేసిన గూగుల్ త‌ల్లి.. 

Balakrishna
2018-10-09 12:43:37

మ‌న‌కు ఏదైనా అనుమానం వ‌స్తే గూగుల్ ను అడుగుతాం.. మ‌రి గూగుల్ త‌ల్లే త‌ప్పు చేస్తే.. ఇంకెవ‌ర్ని అడ‌గాలి..? ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. అన్ని వివ‌రాలు మ‌న‌కు అందించే గూగుల్ ఓ భారీ త‌ప్పిదం చేసింది. ఏకంగా నంద‌మూరి బాల‌కృష్ణ‌ను చ‌నిపోయిన‌ట్లు చూపించింది. దీనిపై ఫ్యాన్స్ కూడా సీరియ‌స్ అయ్యారు.. భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. త‌ప్పులు చేయ‌డం స‌హ‌జ‌మే కానీ మ‌రీ ఇంత‌గా త‌ప్పు చేయ‌డం మాత్రం నిజంగా త‌ప్పే. బ‌తికి ఉన్న మ‌నిషిని చ‌చ్చిపోయాడ‌ని చూపించ‌డం దారుణం.. అందులోనూ బాల‌య్య లాంటి స్టార్ హీరో విష‌యంలో ఇలా జ‌ర‌గ‌డం అభిమానుల‌కి కోపం తెప్పిస్తుంది. 

అస‌లు విష‌యం ఏంటంటే క‌న్న‌డ‌లో కూడా టిఎన్ బాల‌కృష్ణ అనే న‌టుడు ఉన్నాడు.. ఆయ‌న 1913లో పుట్టి 1995లో క‌న్ను మూసాడు. ఆయ‌న స్థానంలో మ‌న బాల‌య్య ఫోటో పెట్టి గూగుల్ లో అప్ లోడ్ చేసారు. దాంతో బాల‌య్య ఫోటో పెట్టి 1995లోనే చ‌నిపోయారంటూ వీకిపీడియాలో పోస్ట్ చేసారు. దాంతో ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చింది. సోష‌ల్ మీడియాలో దారుణంగా క‌మెంట్ చేసే స‌రికి వెంట‌నే తేరుకున్న గూగుల్.. మ‌ళ్లీ ఫోటోను మార్చేసారు. ఇలాంటి విష‌యాల్లో ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటే అంత మంచిది అంటారు. కానీ గూగుల్ లో.. అందులోనూ వీకిపీడియాలోనే ఇలాంటి త‌ప్పులు వ‌స్తే ఇంకెవ‌ర్ని అడుగుతారు..? అందుకే అంతా నిజం కాదు.. వ‌చ్చిందంతా న‌మ్మ‌నూ లేము. 

More Related Stories