English   

అర‌వింద స‌మేత‌లో అదే పెద్ద స‌ర్ ప్రైజ్.. 

Aravinda-Sametha
2018-10-09 06:47:09

అర‌వింద స‌మేత సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు.. అస‌లు సినిమా ఎలా ఉండ‌బోతుందో..? ఎన్టీఆర్ అందులో ఎలా ఉంటాడో..? అత‌న్ని మ‌రోసారి ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ గా త్రివిక్ర‌మ్ ఎంత కొత్త‌గా చూపించి ఉంటాడో అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ క‌నిపిస్తుందిప్పుడు. అయితే అంతా బాగానే ఉంది కానీ మ‌రో స‌ర్ ప్రైజ్ కూడా ఈ చిత్రంలో ఉంది. అదే ఇందులో ఎన్టీఆర్ తొలి అర‌గంట మాట్లాడ‌కుండా ఉండ‌టం. అవును.. సినిమా మొద‌లైన తొలి అర‌గంట ఆయ‌న‌కు మాట‌లుండ‌వ‌ని స్వ‌యంగా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ క‌న్ఫ‌ర్మ్ చేసాడు. ఏదైనా అవ‌స‌రం అయిన‌పుడు త‌ప్పు అస‌లు ఇందులో ఎన్టీఆర్ నోరు తెర‌వ‌డ‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. 

అంటే అత‌డు సినిమాలో మ‌హేష్ బాబు మాదిరి అన్న‌మాట‌. అందులో ఆయ‌న కూడా అంతే. అవ‌స‌రం అనుకున్నపుడు మాత్ర‌మే మాట్లాడుతుంటాడు లేదంటే అస్స‌లు నోరు కూడా తెర‌వ‌డు. ఇప్పుడు ఎన్టీఆర్ పాత్ర‌ను కూడా ఇలాగే డిజైన్ చేసాడు త్రివిక్ర‌మ్. త‌ర్వాత ఉంటుంది కానీ తొలి అర‌గంట మాత్రం నో డైలాగ్స్ అంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇదివ‌ర‌కు న‌ర‌సింహుడులో ఫ‌స్టాఫ్ అంతా మౌనం గానే ఉన్నాడు త్రివిక్ర‌మ్. ఇప్పుడు ఇక్క‌డ అర‌గంట మాత్ర‌మే.. మ‌రి ఈ ప్ర‌యోగం ఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలిక‌..!

More Related Stories