English   

అర‌వింద స‌మేత‌లో అవ‌న్నీ ఏం ఉండ‌వా..?

Aravinda-Sametha
2018-10-09 15:03:37

త్రివిక్ర‌మ్ సినిమా అంటే ప్రేక్ష‌కులు కొన్ని లెక్క‌లు వేసుకుని థియేట‌ర్స్ కు వెళ్తారు.. ఇది ఉంటుంది.. అది ఉంటుంద‌ని ఊహించుకుంటారు. కానీ అర‌వింద స‌మేత విష‌యంలో మాత్రం అవేవీ ఉండ‌వ‌ని ముందుగానే హింట్ ఇస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అస‌లు అవేవీ లేకుండా ఓ సీరియ‌స్ డ్రామాను చూడ్డానికి ప్రేక్ష‌కులు సిద్ధంగా ఉండండ‌ని ఇప్ప‌టికే చెప్పాడు త్రివిక్ర‌మ్. ఇప్పుడు ఇంట‌ర్వ్యూల్లోనూ ఇదే మాట చెబుతున్నారు. చాలా మంది చూస్తున్న ఈ సీరియ‌స్ ఇష్యూను ఈ సినిమాలో చూపించాం అని.. ఇందులో క‌మ‌ర్షియ‌ల్ కోసం ప్ర‌త్యేకంగా పెట్టే ఐట‌మ్స్ ఒక్క‌టి కూడా లేవు అని చెప్పారు త్రివిక్ర‌మ్, ఎన్టీఆర్. 

ఎంట‌ర్ టైన్మెంట్ అంటే కేవ‌లం కామెడీ మాత్ర‌మే కాద‌ని.. రెండున్న‌ర గంట‌ల పాటు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిపడేసేలా కూర్చోబెట్టేది ఏదైనా ఎంట‌ర్ టైన్మెంటే అంటున్నాడు త్రివిక్ర‌మ్. మొత్తానికి సినిమా విష‌యంలో మాత్రం ఎక్కువ‌గా కామెడీ ఉంటుంద‌ని.. గ‌త సినిమాల‌ను దృష్టిలో పెట్టుకుని రావ‌ద్ద‌ని ముందుగానే ప్రేక్ష‌కుల బుర్ర‌ల‌ను ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రైల‌ర్స్ చూస్తుంటే కూడా ఇదే నిజ‌మ‌ని అర్థ‌మైపోతుంది. ఇలాంటి టైమ్ లో మ‌రి అర‌వింద స‌మేత వ‌చ్చి ఏం చేస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే త్రివిక్ర‌మ్ సినిమాలో కామెడీ లేక‌పోతే ప్రేక్ష‌కులు అంత ఈజీగా ఒప్పుకోరు. మ‌రి చూడాలిక‌.. ఈయ‌న దారి మార్చుకుని ధైర్యంగా చేసిన ప్ర‌య‌త్నం ఎంత‌వ‌ర‌కు మెప్పిస్తుందో..? 

More Related Stories