English   

పవన్ కళ్యాణ్ అత్తలా రమ్యకృష్ణ 

Ramya-Krishna
2018-10-09 16:40:51

పవన్ కళ్యాణ్ మళ్లీ నటిస్తున్నాడా అనే డౌట్ అక్కర్లేదు. ఆయన నటించడం లేదు. కానీ ఇప్పుడు రమ్యకృష్ణ మాత్రం ఆయన అత్త పాత్రలోకి వెళ్లిపోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్  కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేదీ తమిళ్ లో రీమేక్ అవుతోంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ అత్త నదియా చేసిన పాత్రను ఇప్పుడు తమిళ్ లో రమ్యకృష్ణ చేయబోతోంది. యస్.. మొన్నటి వరకూ ఈ పాత్రను ఖుష్బూ చేస్తుందనుకున్నారు చాలామంది. ఖుష్బూ కూడా ఈ క్యారెక్టర్ పై ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మరికొందరు మాత్రం మళ్లీ నదియానే తీసుకోవాలనుకుంటున్నారు అన్నారు. బట్.. నదియాపై రీమేక్ టీమ్ ఇంట్రెస్ట్ గా లేదని టాక్. అందుకే రమ్యకృష్ణను అప్రోచ్ అయ్యారు. ఫైనల్ గా తనూ ఓకే చెప్పింది.  ఇక ఈ సినిమాను రీమేక్ చేస్తోన్న దర్శకుడు సుందర్ సి కి రమ్యకు మధ్య మంచి స్నేహం కూడా ఉంది. కాంట్రవర్శీయల్ స్టార్ శింబు హీరోగా నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ మూవీతో రమ్యకృష్ణ ఫస్ట్ టైమ్ తమిళ్ లో అత్త పాత్రలో కనిపించబోతోంది. తెలుగులో ఈ పాత్ర చేసిన నదియాకు ఇక్కడ ‘స్టార్ అత్త’రేంజ్ వచ్చింది. తను ఓవర్ నైట్ ఫుల్ బిజీ అయిపోయింది. ఇప్పుడు కోలీవుడ్ లో ఈ పాత్ర రమ్యకు కూడా అదే క్రేజ్ తెస్తుందా అనేది చూడాలి. 

More Related Stories