English   

రెడ్డీ డ్యాన్సులు చూడూ

Reddy-Ikkada-Soodu
2018-10-09 19:10:51

టాలీవుడ్ లో టాప్ డ్యాన్సర్స్ ఎవరూ అంటే ఎన్టీఆర్ నుంచే మొదలుపెడతారు. అటు క్లాసికల్ డ్యాన్స్ లోనూ ప్రవేవం ఉన్న యంగ్ టైగర్ ఎలాంటి మూమెంట్ అయినా అదరగొట్టేయగలడు. అందుకే ఆయన్నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా డ్యాన్సులూ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ ఫస్ట్ టైమ్ అరవింద సమేతవీరరాఘవ సినిమా ఆల్బమ్ విన్న తర్వాత అరె ఇందులో డ్యాన్సులు ఉండవేమో అనుకున్నారు. బట్ వారికోసం ఓ పాట ఉంటుందని ముందునుంచీ చెబుతూ వస్తోంది టీమ్. అనుకున్నట్టుగానే ఆ పాట రెడ్డీ ఇక్కడచూడూ అనేదే. యస్ లేటెస్ట్ గా ఈ సాంగ్ నుంచి ఓ వీడియో ప్రోమో రిలీజ్ చేశారు. ఊహించినట్టుగానే ఇందులో యంగ్ టైగర్ డ్యాన్స్  విశ్వరూపం చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

నిజానికి ఇంతకు ముందు వచ్చిన అనగనగా పాటలోనూ క్లాస్ స్టెప్స్ చాలానే ఉన్నాయి. ప్రోమోలోనే అద్దిరిపోయాయి స్టెప్పులు అనిపించుకున్నాడు. అంటే ఇంక పాటలో ఇంకా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. కానీ ఇది కంప్లీట్ గా మాస్ నంబర్. అందుకు తగ్గ స్టెప్పులతోనే అలరించబోతున్నారు. కానీ ఎటొచ్చీ.. తమన్ సంగీతం అందించిన ఈ పాటే ఇప్పటికే ఎన్నో సార్లు విన్నట్టుగా రొటీన్ ట్యూన్ గా వినిపిస్తోంది. అయినా పాటకంటే ఎన్టీఆర్ స్టెప్పులు డామినేట్ చేయగలిగితే.. పాట గురించి మర్చిపోతారు. ఇక మరి కొన్ని గంటల్లోనే అరవిందుడు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.  త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ పై ఉణ్న అంచనాలను ఖచ్చితంగా నిలబెట్టుకుంటారనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఫ్యాన్స్. ఇక పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటించిన ఈ మూవలో జగపతిబాబు విలన్ గా నటిస్తుండగా నాగబాబు కీలక పాత్రలో నటించబోతున్నాడు. 

More Related Stories