English   

అతిలోక సుందరి కానున్న రకుల్

Rakul Preet Singh Confirmed in NTR Kathanayakudu as Legendary Actress Sridevi Role
2018-10-09 20:29:56

రకుల్ ప్రీత్ సింగ్ గిరాకీ తగ్గిందిప్పుడు. తమిళ్ లో ఓ రెండు సినిమాలు చేస్తోంది కానీ.. అవి ఫస్ట్ హీరోయిన్ కు ఎక్కువ సెకండ్ హీరోయిన్ కు తక్కువ అన్నట్టుగా ఉన్నాయి. అందుకే మళ్లీ తెలుగులో పాగా వేయాలని.. ఆ మధ్య రేట్ కూడా తగ్గిస్తానని చెప్పింది. కానీ ఆ డైలాగ్ ఎవర్నీ ఆకట్టుకోలేదు. ఇంకా పెద్ద ఆఫర్స్ రాలేదు. కానీ ఈలోగా అనుకోకుండా అమ్మడికి శ్రీదేవిలా నటించే ఛాన్స్ వచ్చింది. మరి అలాంటి ఛాన్స్ ను ఖాళీగా ఉన్న ఎవరైనా వదులుకుంటారా..? అందుకే అమ్మడు వెంటనే ఎస్ చెప్పింది. యస్.. క్రిష్ డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘‘ఎన్టీఆర్’’ కథానాయకుడు లో రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవిలా నటించబోతోంది.

ఇక ఎన్టీఆర్, శ్రీదేవి అనగానే ఎవరికైనా మొదట గుర్తొచ్చే పాట ‘ఆకుచాటు పిందె తడిసె’. అందుకే ఈ పాటను ఈ బయోపిక్ లో రీమిక్స్ చేస్తున్నారు. ఆ మిక్స్ లో అందాలారబోసేది రకుల్ ప్రీత్ సింగ్ అన్నమాట. అంటే పేరుకు ఎన్టీఆర్ అయినా తీరుకు బాలయ్య అండ్ రకుల్ చేస్తారు. ఏదేమైనా ఈ మధ్య తన మేకోవర్ కాస్త శ్రీదేవికి దగ్గరగా వచ్చేలా కనిపిస్తోంది. ఇదంతా దర్శకుడు క్రిష్ మహిమే అనుకోవాలి. మరోవైపు అక్కినేని నాగేశ్వరరావు అంతటి నటుడుకి ఈ సినిమాలో పెద్దగా స్క్రీన్ స్పేస్ ఉండదని చెబుతున్నారు. కానీ శ్రీదేవి పాత్ర అక్కినేని కంటే ఎక్కువ టైమ్ ఉంటుందని టాక్. మొత్తంగా శ్రీదేవిలా రకుల్ ప్రీత్ సింగ్ అందాలు వాన పాటలో ఆకుచాటున తడిసిన పిందెలు కాబోతున్నాయన్నమాట.

More Related Stories