English   

హెబ్బా పటేల్ ముద్దులకు సర్టిఫికెట్ ఇచ్చారు

Hebah Patel’s 24 Kisses Movie Received Censor Certificate
2018-10-09 21:07:22

హెబ్బా పటేల్ సినిమాకు సెన్సార్ వాళ్లు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. మరి ఇవ్వరా.. ఏకంగా సినిమా టైటిలే 24కిస్సెస్ కదా. ఆ టైటిల్ తో ఇంకేదైనా చూపిస్తారా అంటే అదేం లేదు ఓన్లీ ముద్దులే చూపిస్తాం అని టీజర్ తోనూ తేల్చారు కదా. ఒకటీ రెండు ముద్దులుంటేనే సర్టిఫికెట్స్ మారిపోతోన్న ఈ టైమ్ లో 24ముద్దులంటే ఏ సర్టిఫికెట్ ఇవ్వరూ.. యస్.. హెబ్బా పటేల్, అదిత్ అరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీ చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ కూడా ఆకట్టుకుంది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హెబ్బా పటేల్ ను హీరో.. నా ముద్దులెలా ఉన్నాయి అని అడిగితే.. ‘డబ్బులిస్తే ఏదైనా బానే ఉంటుంద’ని అంటూ చెప్పిన బోల్డ్ డైలాగ్ కు అంతా షాక్ అయ్యారు.

Hebah Patel’s 24 Kisses Movie Received Censor Certificate

ఇప్పటికే హెబ్బా పటేల్ కు బోల్డ్ బ్యూటీ అన్న ఇమేజ్ ఉంది. ఇక టైటిల్ తో పాటు సినిమా కంటెంట్ కూడా అలాగే ఉంటే అమ్మడు ఇంకెంత రెచ్చిపోతుందో వేరే చెప్పక్కర్లేదేమో. పైగా ఇప్పుడు తను కనుమరుగయ్యే దశలో ఉంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే తను మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. మరి హిట్ కావాలంటే తను ఏ మాత్రం ఒళ్లు దాచుకోకుండా కష్టపడాలి. ఆ విషయం అమ్మడికి తెలియంది కాదు. అందుకే ఆ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదంటున్నారు.

Hebah Patel’s 24 Kisses Movie Received Censor Certificate

ఇక ఆశ్చర్యం ఏంటంటే.. ఫస్ట్ మూవీ ‘మిణుగురులు’తో జాతీయ అవార్డ్ కొట్టిన దర్శకుడు అయోధ్యకుమార్ తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమా విడుదల చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డ అయోధ్య కుమార్ ఈ సారి ఏకంగా యూత్ ఫుల్ బోల్డ్ కంటెంట్ తో వస్తున్నాడు. పైగా ఇప్పుడు ఎంగిలిముద్దుల సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి కదా.. అందుకే 24 కిస్సెస్ కు మంచి డిమాండే ఉంది. మరి సడెన్ గా సెన్సార్ చేయించారంటే అతి త్వరలోనే రిలీజ్ డేట్ కూడా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

More Related Stories