English   

అతిలోక సుందరిగా రకుల్ కేక పెట్టిస్తోంది

Rakul’s First Look as Sridevi Released from NTR Biopic
2018-10-10 10:03:10

ర‌కుల్ ప్రీత్ సింగ్.. ఈ ముద్దుగుమ్మ గురించి ఏం చెప్పాలి..? త‌క్కువ టైమ్ లోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన సోకుల క‌రెంట్ తీగ ఈ భామ‌. అక్టోబ‌ర్ 10న ఈమె పుట్టిన‌రోజు. 28 వ‌సంతాలు పూర్తి చేసుకుని 29లోకి అడుగు పెడుతుంది ఈ బ్యూటీ. ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. అయితే తెలుగులో మాత్రం అవ‌కాశాలు లేవు. స్పైడ‌ర్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా విడుద‌ల చేయ‌లేదు ర‌కుల్. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో శ్రీ‌దేవి పాత్ర కోసం ర‌కుల్ ను తీసుకున్నారు. ఇప్ప‌టికే టెస్ట్ క‌ట్ అయిపోయింది. రకుల్ బర్త్ డే సందర్భంగా ఇప్పటికే రకుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ పాత్ర కోసమే ఇప్పుడు అంతా వేచి చూస్తున్నారు.

Rakul’s First Look as Sridevi Released from NTR Biopic

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ర‌కుల్ చేసేది చిన్న పాత్రే అయినా కూడా క‌థ‌లో కీల‌కం. ఎందుకంటే ఎన్టీఆర్ తో చాలా సినిమాలు చేసింది శ్రీదేవి. అందులోనూ బాల‌య్య‌తో క‌లిసి ఇప్పుడు ఆకుచాటు పిందె త‌డిసేతో పాటు మ‌రికొన్ని హిట్ సాంగ్స్ కి స్టెప్పులు వేయ‌బోతుంది ఈ ముద్దుగుమ్మ‌. అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ఈ పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. మొన్న‌టి వ‌ర‌కు రేప‌ల్లె షెడ్యూల్ తో బిజీగా ఉన్న క్రిష్.. ఇప్పుడు మ‌కాం హైద‌రాబాద్ కు మార్చేసాడు. మొత్తానికి ఈ చిత్రంలో ర‌కుల్ తో పాటు క‌ళ్యాణ్ రామ్ కూడా చాలా కీల‌కం కానున్నాడు. ఈయ‌న హ‌రికృష్ణ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

More Related Stories