English   

అరవింద సమేత కూడా ట్రెండ్ ఫాలో అవుతుంది

NTR’s Aravinda Sametha Movie Huge Trending length Confirmed
2018-10-10 10:29:12

ట్రెండ్ ఫాలో అవుతున్న అర‌వింద స‌మేత. ఈ రోజుల్లో సినిమాలు ఎలా ఉన్నా కూడా సెంటిమెంట్ కీల‌కంగా మారింది. ఇప్పుడు అర‌విందుడు కూడా ఇదే చేస్తున్నాడు. ఈ మ‌ధ్యే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యు బై ఏ స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. అయితే ఈ చిత్ర ర‌న్ టైమ్ ఏకంగా రెండు గంట‌ల 47 నిమిషాలు ఉంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇంత సేపు ప్రేక్ష‌కుల‌ను కూర్చోబెట్టేంత స‌త్తా సినిమాలో ఉందా అని..? ఎందుకంటే ఈ మ‌ధ్య వ‌చ్చిన నా పేరు సూర్య కూడా దాదాపు అంతే నిడివితో వ‌చ్చింది కానీ సినిమా ఫ్లాప్. అయితే ఇప్పుడు ఓ విష‌యాన్ని సీరియ‌స్ గా చెప్ప‌డానికి చూస్తున్నారు ద‌ర్శ‌కులు.

కాస్త ఎక్కువ సేపు అయినా ప‌ర్లేద‌ని కూర్చోబెట్టేస్తున్నారు. ఇప్పుడు అర‌వింద స‌మేత ఇదే చేసి చూపిస్తున్నాడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్. ఇందులో ఉన్న విష‌యం చెప్ప‌డానికి త‌క్కువ స‌మ‌యం స‌రిపోలేద‌ని చెబుతున్నాడు మాట‌ల మాంత్రికుడు. అందుకే భారీ నిడివితో తీసుకొచ్చాడు త్రివిక్ర‌మ్. అర్జున్ రెడ్డి.. రంగ‌స్థ‌లం.. భ‌ర‌త్ అనే నేను.. మ‌హాన‌టి మూడు గంట‌ల‌తో వ‌చ్చి అల‌రించాయి. ఈ ట్రెండ్ లోనే అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌ కూడా వెళ్తుంద‌ని న‌మ్ముతున్నాడు ఎన్టీఆర్. వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. ఆకాశ‌మే అంచ‌నాలుగా ఈ చిత్రంతో వ‌స్తున్నాడు. అక్టోబ‌ర్ 11న ఈ చిత్రం విడుద‌ల కానుంది. మ‌రి చూడాలి.. త్రివిక్ర‌మ్ చెప్పిన ఇష్యూ ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు మెప్పిస్తుందో..?

More Related Stories