English   

అంత సీరియస్ ఎందుకు త్రివిక్ర‌మ్ గారూ..? 

Aravinda-Sametha
2018-10-10 04:45:13

అవును.. ఇప్పుడు నిజంగానే త్రివిక్ర‌మ్ సీరియ‌స్ గా ఉన్నాడు. ఎప్పుడూ న‌వ్వుతూ క‌నిపించే త్రివిక్ర‌మ్ లో ఇంకో మ‌నిషి ఉన్నాడ‌ని చెప్పాడు ఎన్టీఆర్. ఇప్పుడు దీనికి సాక్ష్యం క‌నిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తాను చేసిన సినిమాల్లో చాలా కొత్త‌గా ఉండేది అర‌వింద స‌మేత అంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఫ్యాక్ష‌న్ లో కొత్త‌గా ఏం చూపిస్తార‌నే అనుమానం రావ‌చ్చు కానీ ఇందులోనూ చాలా కొత్త‌గా ట్రై చేసాం అని గుర్తు చేసాడు  మాట‌ల మాంత్రికుడు. ముఖ్యంగా ఇందులో కామెడీ గీమిడీ లాంటివి  ఏమీ ఉండ‌వ‌ని ముందుగానే హింటిచ్చేసాడు ద‌ర్శ‌కుడు. అంతా సీరియ‌స్ డ్రామా చూడ్డానికి రెడీగా ఉండండి అంటూ ప్రేక్ష‌కుల బుర్ర‌ల‌ను సిద్ధం చేస్తున్నాడు.  ట్రైల‌ర్.. టీజ‌ర్.. పాట‌లు ఇలా అన్నీ అదే చెబుతున్నాయి కూడా. ఇక ఇప్పుడు విడుద‌ల‌కు రెండు రోజుల ముందు పూర్తైన సెన్సార్ కూడా ఇదే చెబుతుంది. రెండు గంట‌ల 47 నిమిషాల కంప్లీట్ సీరియ‌స్ డ్రామా ఇది అని తెలుస్తుంది. పైగా ఇందులో సునీల్ కూడా కాస్త సీరియ‌స్ గా ఉండే పాత్ర‌లోనే క‌నిపిస్తున్నాడ‌ని తెలుస్తుంది. అస‌లు అజ్ఞాత‌వాసి లాంటి ఫ్లాప్ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు మారిపోయాడు అంటే ఏమో అనుకున్నారు కానీ మ‌రీ ఇంత‌గా మారిపోతాడ‌ని ఊహించ‌లేదు. క‌చ్చితంగా ఈ చిత్రం తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రికొత్త క‌థ‌ల‌కు పునాది వేస్తుంద‌ని న‌మ్ముతున్నాడు త్రివిక్ర‌మ్. మ‌రి చూడాలిక‌.. ఆయ‌న న‌మ్మ‌కాన్ని అర‌వింద స‌మేత ఎంత వ‌ర‌కు నిల‌బెడుతుందో..? అక్టోబ‌ర్ 11న ఈ చిత్రం విడుద‌ల కానుంది. 

More Related Stories