English   

ఏక్ నిరంజన్ అవుతున్న నిత్యా మీనన్

Nithya Menon Praana Movie First look Released
2018-10-10 16:21:25

అవును.. ఇప్పుడు నిత్యామీన‌న్ చేసిన ప‌నికి ఆమెను అలాగే పిల‌వాలి. ఆమెను ఏక్ నిరంజ‌నీ అన‌డంలో త‌ప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు చేస్తోన్న సినిమా అలాంటిది మ‌రి. ఓ సినిమా అంటే స్క్రీన్ నిండా న‌టులు క‌నిపిస్తుంటారు. కానీ ఒక్క‌రితోనే సినిమా అంతా చేయాలంటే మాత్రం చాలా క‌ష్టం. ఇప్పుడు ఆ సాహ‌సం చేస్తుంది నిత్యామీన‌న్. మ‌ళ‌యాల ద‌ర్శ‌కుడు వికే ప్ర‌కాశ్ చెప్పిన క‌థ న‌చ్చి ప్రాణ సినిమా క‌మిటైంది నిత్యా. ఇందులో ఈమె త‌ప్ప ఇంకెవ‌రూ ఉండ‌రు. పీసీ శ్రీరామ్‌ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు. ప్రాణ సినిమాలో ఉన్న‌ది నిత్యా పాత్ర మాత్ర‌మే. సమాజంలో జ‌రిగే సమస్యలపై పోరాడే ర‌చ‌యిత్రి ప్రాణ పాత్ర‌లో న‌టిస్తుంది నిత్యామీన‌న్.

Nithya Menon Praana Movie First look Released

సినిమాలో ఆమె మ్యూజిక్‌ ఆఫ్‌ ప్రీడమ్‌ అనే బుక్‌ రాస్తుంది. ఈ పుస్త‌కానికి కీల‌కం ఇది. అప్ప‌ట్లో జ‌గ‌ప‌తిబాబు అత‌డే ఒక సైన్యం అంటే ఇప్పుడు నిత్యా ఆమె ఒక సైన్యం అంటుంద‌న్న‌మాట‌. సింక్రోనైజ్డ్‌ సరౌండ్‌ సౌండ్‌ సిస్టమ్‌ అనే కొత్త టెక్నాలజీని సౌండ్‌ డిజైనర్‌ రసూల్‌ పూకుట్టి ఈ చిత్రం కోసం వాడుతున్నారు. ఒకేసారి నాలుగు భాష‌ల్లో ఈ చిత్రం వ‌స్తుంది. పైగా నిత్యామీన‌న్ కు క‌న్న‌డ‌, తెలుగు, మ‌ళ‌యాలం, త‌మిళ భాష‌లు వ‌చ్చు. కాబ‌ట్టి అన్ని భాష‌ల్లోనూ త‌నే డ‌బ్బింగ్ చెప్పుకుంటుంది. దానికి తోడు హిందీ కూడా వ‌చ్చు. అక్క‌డా విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబ‌ర్ లోనే విడుద‌ల కానుంది. తాజాగా మొత్తానికి నిత్యా అలా ఏక్ నిరంజ‌నీ అయిపోయింది.

More Related Stories