English   

హలో.. కొత్తగా అనిపించడం లేదు గురూ

Hello Guru Prema Kosame Trailer Not Impressed
2018-10-10 18:47:56

రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ‘హలోగురూ ప్రేమకోసమే’ ట్రైలర్ విడుదలైంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. అయితే ఈ సినిమా ట్రైలర్ అంచనాలకు తగ్గట్టుగా మాత్రం కనిపించలేదు. టీజర్ తో హాట్ గా ఆకట్టుకున్న ఈ టీమ్ ట్రైలర్ తో ఆ ఇంప్రెషన్ ను మరింత పెంచడంలో సక్సెస్ అయ్యారు అని చెప్పలేం. పైగా ట్రైలర్ చూస్తుంటేనే చాలా సినిమాలు గుర్తొస్తున్నాయి. పైగా అవన్నీ ఈ మధ్య వచ్చిన సినిమాల్లానే కనిపిస్తుండటం పెద్ద డ్రా బ్యాక్ గా కనిపిస్తోంది. రామ్ ఎప్పట్లానే ఎనర్జిటిక్ గా ఉన్నా.. అనుపమ మరీ డల్ గా కనిపిస్తోంది.

లవ్ లీ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కు అపోజిట్ గా ప్రకాష్ రాజ్ పాత్ర కనిపిస్తోంది. మందేసి చిందేసే బ్యాచ్ లా హీరో అండ్ టీమ్ కనిపిస్తోంది.. నేను శైలజలో హీరోయిన్ లా అనుపమా కనిపిస్తోంది. ఇక ట్రైలర్ ఫస్ట్ డైలాగే హీరో క్యారెక్టర్ ను ఛలో సినిమా హీరోక్యారెక్టర్ ను తలపించేలా ఉంచారు. ఇక రెండు నిమిషాల ట్రైలర్ లోనే త్రివిక్రమ్, పూరీ మిక్స్ చేసినట్టుగా అనేక డైలాగ్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ వాటిలో కొన్ని మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయనుకోండి. అలాగే తండ్రి, లవర్, ఫ్రెండ్ విషయంలో మందు ను కామన్ చేస్తూ రామ్ చెప్పిన డైలాగ్ ‘ఉన్నది ఒకటే జిందగీ’లో అదే అనుపమాతో ఫ్రెండ్ గురించి మాట్లాడించినట్టుగా కాస్త అపోజిట్ గా ఉన్నాయి. మరి ఇన్ని చెప్పాక ఈ ట్రైలర్ లో కొత్తదనం ఏముందీ అనుకోవాలో తీసిన వారికే తెలియాలి.

కాకపోతే ట్రైలర్ ను బట్టి సినిమాను పూర్తిగా అంచనా వేయలేం. ఏమో వీటి చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు బావుంటాయో.. వాటి ద్వారా సినిమా హిట్టూ కావొచ్చేమో. కానీ ముందు సినిమా థియేటర్ వరకూ రప్పించాలంటే ట్రైలర్ ఇంకాస్త బెటర్ గా కట్ చేసి ఉండాల్సింది అనిపిస్తోంది. మొత్తంగా హలో గురూ ప్రేమకోసమే ట్రైలర్ కొత్తగా మాత్రం అనిపించడం లేదు. ఇక ఈ దసరాకు విడుదల కాబోతోన్న ఈ మూవీపై రామ్ అండ్ అనుపమ భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ ట్రైలర్ చూస్తే ఇలా ఉంది. అటు దిల్ రాజు కూడా ఓ భారీ హిట్ కోసం చూస్తున్నాడు. మరి వీరి ఆశలు నెరవేరుతాయా లేదా అనేది చూడాలి.

More Related Stories