English   

నాని సమంత మళ్ళీ కలిసి నటిస్తారా?

Natural Star Nani Samantha Will Work For Tamil Movie 96 Remake
2018-10-10 19:50:47

నాని, సమంత.. ఇద్దరూ ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. వీటిలో మొదటిది ఈగ అయితే రెండోది ఎటోవెళ్లిపోయింది మనసు. ఎటోవెళ్లిపోయింది మనసులో ఈ ఇద్దర నటన పీక్స్ లో ఉంటుంది. అద్భుతమైన నటనతో వారెవ్వా అనిపించారు. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ భారమైన ప్రేమకథ కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ.. ఇలాంటి మూవీస్ ను ఇష్టపడేవారికి లైబ్రరీ మూవీ అయింది. ఇక రాజమౌళి ఈగలో నానియే ఈగ కదా. బట్ ఉన్న అరగంటలో కూడా ఈ ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతం అనిపించుకుంది. అలాంటి టాలెంటెడ్ పెయిర్ మళ్లీ కలిసి నటించబోతోందా అంటే అవుననే అంటున్నారు. అది కూడా ఓ రీమేక్ లో.

గత శుక్రవారం తమిళ్ లో విడుదలైన 96మూవీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది కోలీవుడ్ అయింది. అయితే దిల్ రాజు ఈ మూవీ సక్సెస్ ను విడుదలకు ముందే ఉహించినట్టున్నాడు.. అందుకే ముందే రైట్స్ కొనేశాడు. మొదట డబ్బింగ్ చేద్దామనుకున్నాడు. కానీ టాక్ ను బట్టి నిర్ణయం తీసుకోవాలనుకొన్నాడు. ఇప్పుడు ఆ మూవీకి  సూపర్ హిట్ టాక్ రావడంతో రీమేక్ చేద్దామనుకుంటున్నాడు దిల్ రాజు. హీరోగా ముందు నుంచీ నానినే అనుకున్నాడు. హీరోయిన్ గా మళ్లీ త్రిషనే తీసుకోవాలనుకున్నారనే వార్తలు వచ్చాయి. కానీ నాని ముందు త్రిష కాస్త ముదురుగానే కనిపిస్తుంది. అందుకే సమంతను తీసుకోవాలనుకుంటున్నారట. ఇందులో ఎలాంటి వల్గారిటీ లేదు.. పైగా నటనకు బాగా స్కోప్ ఉంది కాబట్టి సమంత ఓకే చెప్పే అవకాశం ఉంది. పైగా తమది హిట్ పెయిర్ కాబట్టి.. హ్యాట్రిక్ కొట్టే ఛాన్సూ ఉంటుంది. ఈ ఆలోచనతోనే దిల్ రాజు సమంతను అప్రోచ్ అవుతున్నాడట. మరి శామ్ ఏం చెబుతుందో కానీ.. ఒకవేళ ఈ కాంబినేషన్ వర్కవుట్ అయితే నానికి ఓ హిట్ పడే అవకాశం ఉంది.

More Related Stories