English   

అర‌వింద స‌మేత ఓవ‌ర్సీస్ టాక్ వ‌చ్చేసింది

NTR’s Aravinda Sametha Overseas Premier Show Talk
2018-10-11 07:30:57

మ‌చ్చ‌ల‌పులి మొహం మీద గాండ్రిస్తే ఎలా ఉంటుందో తెలుసా..? ఇప్పుడు త్రివిక్ర‌మ్ ను చూస్తుంటే కూడా ఇదే డైలాగ్ అనాల‌నిపిస్తుంది. ఒక్క సినిమాతో ఈయ‌న స్టామినా త‌క్కువ అంచ‌నా వేయ‌డం తెలివిత‌క్కువే. అర‌వింద స‌మేత ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. అన్నిచోట్ల నుంచి ఈ సినిమాకు మంచి టాక్ వ‌స్తుంది. ముఖ్యంగా సింపుల్ క‌థ‌ను త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో త్రివిక్ర‌మ్ మాయ చేసాడంటున్నారు ప్రేక్ష‌కులు. ఎన్టీఆర్ వీర‌రాఘ‌వ‌రెడ్డిగా మ‌రో స్థాయిలో న‌టించేసాడ‌ని.. ఎమోష‌న‌ల్ సీన్స్ లో అయితే అత‌డి న‌ట‌న గురించి చెప్ప‌డానికి మాట‌లు చాల‌ట్లేదంటున్నారు. ఫ‌స్ట్ హాఫ్ అంతా డీసెంట్ గా సాగినా.. సెకండాఫ్ ఎమోష‌న‌ల్ గా న‌డిపించాడు త్రివిక్రమ్.

ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో సునీల్, ఎన్టీఆర్ మ‌ధ్య సీన్స్ అన్నీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయ‌ని.. న‌వ్వులు కూడా తెప్పించాయంటున్నారు. తొలి 20 నిమిషాల సినిమా నెక్ట్స్ లెవ‌ల్లో ఉంటుంద‌ని తెలుస్తుంది. అయితే సెకండాఫ్ మాత్రం పూర్తిగా క‌థ‌పైకి వెళ్లిపోవ‌డంతో కాస్త స్లోగా మారింద‌ని.. కానీ ఓవ‌రాల్ గా అర‌వింద స‌మేత యావ‌రేజ్ కంటెంట్ తో వ‌చ్చినా.. త్రివిక్ర‌మ్ త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో సినిమాను ఫ్రెష్ గా మార్చేసాడ‌ని తెలుస్తుంది. క‌చ్చితంగా ఈ చిత్రంతో మ‌రోసారి త్రివిక్ర‌మ్ బౌన్స్ బ్యాక్ అయిన‌ట్లే అంటున్నారు. అజ్ఞాత‌వాసిలో ఏమేం మిస్ అయ్యాయో అన్నీ లెక్కేసుకుని మ‌రీ ఈ చిత్రంతో బాకీ తీర్చేసుకున్నాడు త్రివిక్ర‌మ్. ఇక ఇప్పుడు ద‌స‌రాను పూర్తిగా యూజ్ చేసుకోవ‌డం ఒక్క‌టే మిగిలిపోయింది.

More Related Stories