English   

కొందరు ఉద్య‌మాన్ని త‌ప్పుదోవ పట్టిస్తున్నారు : అనసూయ

Anchor Anasuya Bharadwaj Shocking Comments on Casting Couch Mee Too
2018-10-11 09:03:04

ఇప్పుడు ఏ ఇండ‌స్ట్రీలో చూసినా మీటూ ఉద్యమం బాగా న‌డుస్తుంది. అస‌లు ఇన్నాళ్లూ ఎక్క‌డెక్క‌డో న‌క్కిన హీరోయిన్లు అంతా ఇప్పుడు బ‌య‌టికి వ‌స్తున్నారు. ఒక్క‌రు ధైర్యం చేసి బ‌య‌టికి వ‌స్తే అంతా అదే దారిలో న‌డుస్తున్నారు. త‌ను శ్రీ ద‌త్తా తీసిన ఈ కొత్త ర‌చ్చ‌కు ఇప్పుడు దేశ‌మంతా స‌పోర్ట్ చేస్తుంది. నానా ప‌టేక‌ర్ లాంటి వాళ్లు ప్రతీ ఇండ‌స్ట్రీలో ఉన్నారంటూ ర‌చ్చ చేస్తున్నారు హీరోయిన్లు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఉద్య‌మంపై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది అన‌సూయ‌. అస‌లు ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌పుడు ఇలాంటివి జ‌రుగుతాయ‌ని ముందే ఊహించాల‌ని.. అలాంటి ప‌రిస్థితి వ‌చ్చిన‌పుడు ఎలా త‌ప్పించుకోవాలో తెలిసే తెలివితేట‌లు హీరోయిన్ల‌కు ఉండాల‌ని చెబుతుంది అన‌సూయ‌.

అంతేకాదు.. మీటూ ఉద్యమంలో చాలా మంది హీరోయిన్లు ఇలా బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని చెప్ప‌డం బాగానే ఉంది కానీ.. దీన్ని చాలా మంది త‌మ సొంత లాభానికి వాడుకుంటున్నార‌ని.. ప‌బ్లిసిటీ కోసం బ‌య‌టికి వ‌చ్చి మీటూ ఉద్య‌మాన్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని తెలిపింది అన‌సూయ‌. ఈమె వ్యాఖ్య‌ల్లోనూ నిజం లేక‌పోలేదు.. ఇండ‌స్ట్రీలో ఏ త‌ప్పు జ‌రిగినా కూడా అందులో పూర్తి బాధ్య‌త కేవ‌లం అబ్బాయిల‌దే అన‌డం స‌రికాదు. క‌మిట్ మెంట్ పేరుతో ఖచ్చితంగా అంతా క‌లిసే త‌ప్పు చేస్తార‌ని అప్ప‌ట్లో బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి రేఖ కూడా అన్నారు. అలాంట‌ప్పుడు ఒక్క‌ర్ని త‌ప్పు ప‌ట్ట‌డం న్యాయం కాదు. అందుకే మీ టూ ఉద్య‌మంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది అన‌సూయ‌.

More Related Stories