English   

సాయిపల్లవి పద్ధతేం బాలేదంటోన్న శర్వానంద్

Padi-Padi-Leche-Manasu
2018-10-11 11:52:38

ఓ సినిమా చేస్తున్నప్పుడు ఆర్టిస్టులు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో అప్పుడప్పుడూ అన్ని ఇబ్బందులూ వస్తాయి. చాలా వరకూ వాటిని క్లియర్ చేసుకుంటారు. కానీ శర్వానంద్ మాత్రం ఏకంగా ఓ వీడియోతో సాయిపల్లవి పద్ధతేం బాలేదంటున్నాడు.. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా..? కానీ ఇది నిజం. కాకపోతే ఇది రియల్ ఇన్సిడెంట్ కాదు.. రీల్ ఇన్సిడెంట్.. యస్.. ఇవాళ శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన పడిపడిడలేచె మనసు సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ డైలాగ్ అందులోనిదే.. హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ఓ మంచి లవ్ స్టోరీగా వస్తోంది అనడగానికి ఈ టీజర్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. యస్.. నలభై సెకన్స్ కూడా లేదు ఈ టీజర్. కానీ చూసిన వెంటనే మనసు దోచేస్తుంది. అంత పర్ఫెక్ట్ గా తన స్టోరీని చెప్పకనే చెప్పాడు హను రాఘవపూడి. 

టీజర్ ను బట్టి చూస్తే సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్ గా కనిపిస్తోంది. తన వెంటపడుతూ దూరం దూరంగా వస్తుంటాడు శర్వా. తను మెడికల్ క్యాంప్స్ కు ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతుంటాడు. కానీ తనతో ఏమీ మాట్లాడడు. బట్.. ఆమెకు అర్థమౌతుంది. ఇతను నా వెంట పడుతున్నాడని.. అంతే ఓ రోజు సడెన్ గా వచ్చి అడుగుతుంది. ‘లేవయ్యా లే.. ఏంటీ ఫాలో  చేస్తున్నావా’ అంటే రెబల్ గా అడుగుతుంది అమ్మడు.. దానికి అతను ‘ అరె మీకు తెలిసిపోయిందా.. అయినా మీరిలా దగ్గరకొచ్చి మాట్లాడ్డం ఏం బాలేదండీ.. ఏదో నా పాటికి నేను అరకిలో మీటర్ దూరం నుంచి ప్రేమిస్తుంటే’ అంటూ అమ్మడి పద్ధతి బాలేదని ఇన్ డైరెక్ట్ గా తను లవ్ చేస్తోన్న మేటర్ ప్రపోజ్ చేశాడు చూడండి.. అక్కడే అంతా ఫిదా అయిపోతున్నారు. 

మొత్తంగా హను రాఘవపూడి ‘లై’ ఫ్లాప్ తర్వాత తీస్తోన్న ఈ సినిమాతో మళ్లీ తనకు కంఫర్ట్ జోన్ అయిన లవ్ స్టోరీకే వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ముందు నుంచీ ఊహిస్తున్నట్టుగానే ఇది 90స్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే వీరి కాస్ట్యూమ్స్ కూడా ఉన్నాయి. ఏదేమైనా హను రాఘవపూడి ఈ సినిమాతో మరో హిట్ కొట్టేలా ఉన్నట్టు అర్థమౌతోంది. అన్నట్టు డిసెంబర్ 21న విడుదల అని డేట్ కూడా ఫిక్స్ చేశారు. 

More Related Stories