English   

గళమెత్తిన సమంత

Samantha Supports Singer Chinmayi Sripada’s Allegation on Vairamuthu
2018-10-11 12:44:07

చిన్మ‌యికి స‌పోర్ట్ గా నిలిచిన చిన్మ‌యి.. అవును.. నిజ‌మే చిన్మ‌యికి ఇప్పుడు నిజంగానే మ‌రో చిన్మ‌యి స‌పోర్ట్ గా నిల‌బ‌డింది. ఇక్క‌డ చిన్మ‌యి అంటే సింగ‌ర్.. మ‌రో చిన్మ‌యి అంటే స‌మంత అని అర్థం. ఎందుకంటే ఆమె కెరీర్ ఇంత‌గా ఎదిగిందంటే వాయిస్ కార‌ణం.. ఆ వాయిస్ ఇచ్చింది చిన్మ‌యి. ఇప్పుడు అన్ని ఇండ‌స్ట్రీల్లో మీటూ ఉద్యమం బాగానే ఊపు అందుకుంది. ముఖ్యంగా ఇందులో పెద్దోళ్ల పేర్లు కూడా ఉండ‌టంతో ర‌చ్చ మ‌రీ ఎక్కువైపోతుంది. ఇప్ప‌టికే బాలీవుడ్ లో నానా పటేక‌ర్, నాగ్ రాజ్ మంజులేతో పాటు మ‌రికొంద‌రు పేర్లు కూడా బ‌య‌టికి వ‌స్తున్నాయి. ఇలాంటి టైమ్ లో త‌మిళ‌నాట గ్రేట్ లెజెండ‌రీ రైట‌ర్ వైర‌ముత్తు పేరు బ‌య‌ట పెట్టి సంచ‌ల‌నం సృష్టించింది చిన్మ‌యి.

Samantha Supports Singer Chinmayi Sripada’s Allegation on Vairamuthu

తన‌ను గ‌దిలోకి ర‌మ్మ‌న్నాడ‌ని.. కోరిక తీర్చ‌మన్నాడ‌ని.. సెక్యువ‌ల్ హెరాజ్ మెంట్ చేసాడ‌ని అత‌డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది సింగ‌ర్ చిన్మ‌యి. దీనిపై ఇండ‌స్ట్రీ అంతా చిన్మ‌యికి స‌పోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు స‌మంత కూడా ఈ విష‌యానికి అండగా నిల‌బ‌డింది. చిన్మ‌యి అండ్ రాహుల్.. మీ ఇద్ద‌రూ నాకు ప‌దేళ్లుగా తెలుసు.. మీ ఇద్ద‌రూ ఎంత మంచి వారో నాకు తెలుసు.. అన్నింటి కంటే ముందు నేను మ‌న స్నేహానికి గౌర‌వం ఇస్తున్నాను.. నిజం ఎప్పుడైనా బ‌య‌టికి వ‌స్తుంది.. నేను కూడా దానికే అండ‌గా ఉంటాను.. ఐ ల‌వ్ యూ అంటూ స‌పోర్ట్ ఫ‌ర్ చిన్మ‌యి అంటూ రాసుకొచ్చింది స‌మంత‌. మొత్తానికి త‌న ఫ్రెండుకు అన్యాయం జ‌రిగింద‌ని బ‌య‌టికి వ‌చ్చి నోరు విప్పి మాట్లాడుతుంది స‌మంత‌.

More Related Stories