English   

వాహ్.. సైరాలో వీళ్ల లుక్స్ అద్దిరపోయాయంతే... 

Vijay-Sethupathi
2018-10-11 15:03:50

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘సైరా’పై రోజు రోజుకూ అంచనాలు పెంచుతున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం జార్జియాలో ఓ భారీ యుద్ద సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక రీసెంట్ గా సినిమాలో నటిస్తోన్నవారి కొన్ని లుక్స్ ను విడుదల చేసి సూపర్బ్ అనిపించిన టీమ్.. ఇవాళ అమితాబ్ బచ్చన్ బర్త్ డే సందర్భంగా ఆయన లుక్ ను విడుదల చేశారు. ‘గోశాయి వెంకన్న’ అనే పాత్రలో నటిస్తున్నాడు అమితాబ్. ఇక ఆ మధ్య విడుదల చేసిన సుదీప్ లుక్ కూడా సూపర్ అనిపించుకుంది. ఇక ఈ లుక్ మాత్రం సూపర్ కే సూపర్ అనిపించుకుంది. కారణం ఇది వర్కింగ్ స్టిల్. 

సుదీప్ తో పాటు తమిళ్ టాలెంటెడ్ స్టార్ విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడా ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోనే ఇది. యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా తీసిన ఫోటోలా కనిపిస్తుంది. మరి దీనికి పర్మిషన్ తీసుకుని నెట్ లో పెట్టారో లేదో కానీ.. ఆ ఇద్దరి ఫోటో కూడా  నెట్ లో వైరల్ అవుతోంది. ఇక తమన్న, జగపతిబాబు కూడా ఇతర కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం జార్జియాలో జరుగుతోన్న షెడ్యూల్ తో మూడొంతులు షూటింగ్ పూర్తయిట్టే. చివరి షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకుడు. 

More Related Stories