English   

అరవిందుడి రికార్డులు మోత.. 

Aravinda-Sametha
2018-10-11 15:49:42

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ బాక్సాఫీస్ ను మోత మోగిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్శీస్ లోనూ ఓ రేంజ్ లో కలెక్షన్ల మోత మోగుతోంది. టాక్ పూర్తిగా బ్లాక్ బస్టర్ కాకపోయినా దుమ్మురేపుతోందనే టాక్ తెచ్చుకున్నాడు అరవిందుడు. యంగ్ టైగర్ హైండ్ ఎండ్ ఎమోషనల్ యాక్టింగ్ కు ఎంటైర్ థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. అటు త్రివిక్రమ్ మార్క్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండటంతో క్లాస్ మాస్ మిక్స్ అయిన సూపర్ హిట్ గా నిలిచిందీ మూవీ అంటున్నారు. ఓవర్శీస్ లో 192 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన అరవింద సమేత ప్రివ్యూ షోస్ తోనే హాఫ మిలియన్ దాటి మరీ వసూలు చేశాడు. అక్కడ ఫస్ట్ డేనే ఒన్ మిలియన్ క్లబ్ లో చేరే అవకాశాలున్నాయంటున్నారు. ఇక ఈ వీకెండ్ వరకూ అరవింద సమేత ఓవర్శీస్ లో టాప్ ఫైవ్ లో చేరే ఛాన్సుందనుకోవచ్చు. 

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంబినేషన్ క్రేజ్ వల్ల భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఏపిలో ఉదయమే బెన్ ఫిట్ షోస్ పడ్డాయి. దీనికి తోడు వారం రోజుల వరకూ ఆరు షోస్ కు అనుమతి కూడా ఉండటంతో ఇక్కడా అదిరిపోయే కలెక్షన్స్ వస్తాయి. పైగా దసరా శెలవులు కావడంతో ఇటు తెలంగాణలో కూడా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల మోత మోగడం ఖాయం. మొత్తంగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ ను వీళ్లు ఓ బ్లాక్ బస్టర్ తో నిలబెట్టుకున్నారంటున్నారు. మరి ఈ వారం రోజులతో పాటు దసరా టైమ్ కు కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. దీన్ని బట్టి ఈ మూవీ అటు ఎన్టీఆర్ తో పాటు త్రివిక్రమ్ కెరీర్ లోనే హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించే సినిమాగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయ్ .

More Related Stories