English   

అనుష్క సైజ్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు

Anushka
2018-10-11 18:51:26

కొన్నిసార్లు చాలా ఇష్టపడి చేసిన పనులే కొంప ముంచుతాయి. మన దేవసేన అనుష్కకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో మరో నాలుగైదేళ్లు ఫీల్డ్ ను దున్నేయ్యాల్సిన బ్యూటీ ఇప్పుడు ఎన్నో బాధలు పడుతోంది. అందుకు కారణం.. సైజ్ జీరో అనే సినిమా. పాపం జీరో సైజ్ బ్యూటీస్ పై సెటైర్ వేయాలనుకున్న వీళ్లకు ఈ సినిమా రిజల్ట్ షాక్ ఇచ్చింది. అంతకు మించిన షాక్ అనుష్కకు ఇచ్చింది. సైజ్ జీరో కోసం అమ్మడు బాగా లావైంది. అది ఆ సినిమా వరకూ బానే వర్కవుట్ అయింది. కానీ ఆ తర్వాత తను అనుకున్నంత ఈజీగా తగ్గలేకపోయింది. దీంతో బాహుబలి -2లో తనను అద్భుతంగా చూపించాలనుకున్న రజామౌళి కూడా ఓ దశలో ఇరిటేట్ అయ్యాడు. అతని కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా పెద్దగా తగ్గలేకపోయింది. దీంతో తన సైజ్ ను గ్రాఫిక్స్ లో ఏదోలా లాగించాడు రాజమౌళి. తర్వాత చేసిన భాగమతిలో పాత్రకు తగ్గట్టుగా భారీ పర్సనాలిటీ సరిపోయిది కానీ.. ఇప్పుడు తను రెగ్యులర్ హీరోయిన్ గా ఏ మాత్రం పనికిరాదు అన్నట్టుగా తయారైంది. 

ప్రస్తుతం ‘సైలెన్స్’ అనే సినిమా చేస్తోన్న అనుష్క లావు తగ్గడానికి ఈ సారి గట్టి పంతం పట్టింది. అందుకోసం ‘ఆస్ట్రియా’ దేశం వెళ్లింది. అక్కడ నేచురోపతి ద్వారా లావు తగ్గే అవకాశం ఉందని ఎవరో చెప్పారట. కొన్ని ఆరాలు తీసి నమ్మకం కలగ్గానే వెంటనే ఆస్ట్రియాలో వాలిపోయింది. యస్.. ప్రస్తుతం స్వీటీ ఆస్ట్రియాలో బరువు తగ్గడానికి నేచులర్ పద్ధతిలో చికిత్సలు తీసుకుంటోంది. అయితే ఇది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. డిటాక్సికేషన్ కు కూడా ఉపయోపడుతుందట. రెండువారాల పాటు సాగే ఈ కంప్లీట్ డైట్ ట్రీట్మెంట్ తో తను మాగ్జిమం పాత రూపానికి వస్తుందని వాళ్లు ఖచ్చితంగా చెబుతున్నారు. దీంతో తను కూడా బాగా నమ్మింది. మరి తన నమ్మకం ఫలిస్తే ఇక్కడికి రాగానే రెండు ప్రాజెక్ట్స్ తన కోసం వెయిట్ చేస్తున్నాయి. ఏదేమైనా సైజ్ జీరో సినిమా అనుష్క కెరీర్ తో ఓ ఆటాడుకుంటోందని చెప్పొచ్చు. 

More Related Stories