English   

అర‌వింద స‌మేత బెస్ట్ ఇంట్రో సీన్

Most Excited Hero Introduction Scene in Aravinda Sametha
2018-10-12 08:17:16

సాధార‌ణంగా హీరోను తొలి సీన్ లో ఎలా చూపిస్తారు..? అస‌లు ఆయ‌న ఇంట్రోను ఎలా ప్లాన్ చేస్తారు..? స‌్టార్ హీరో సినిమా అయితే ఆయ‌న ఇంట్రో ఓ రేంజ్ లో ఉంటుంది.. పైగా ఫ్యాక్ష‌న్ సినిమా కాబ‌ట్టి ఇంకాస్త ఎక్కువే ఊహించుకుంటారు ప్రేక్ష‌కులు. కానీ అర‌వింద స‌మేత‌లో మాత్రం అంతా రివ‌ర్స్ లో జ‌రిగింది. ఇందులో ఎన్టీఆర్ ఇంట్రో చాలా సింపుల్ గా ఉంటుంది. ఆయ‌న రావ‌డం మామూలుగానే ఉంటుంది. కానీ ఒక్క‌సారి వ‌చ్చిన త‌ర్వాత ర‌చ్చ మాత్రం మామూలుగా ఉండ‌దు. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఏ ద‌ర్శ‌కుడు కూడా ఈ స్థాయి ఇంట్రో ఏ హీరో కోసం డిజైన్ చేసి ఉండ‌డు. క్లైమాక్స్ లో వ‌చ్చే ఫైట్ ను ముందుగానే పెట్టేసాడు ద‌ర్శ‌కుడు. యుద్ధం త‌ర్వాత వ‌చ్చే శాంతి కోసం ఈ సినిమా క‌థ అని ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు త్రివిక్ర‌మ్. అందుకే ముందుగానే యుద్ధం పెట్టేసాడు.

హీరో యుద్ధం చేసిన త‌ర్వాత గెల‌వ‌డానికి బ‌య‌టికి వ‌స్తాడు. అర‌వింద స‌మేత‌లో ఇదే కొత్త‌గా అనిపించింది కూడా. సాధార‌ణంగా ఫ్యాక్ష‌న్ సినిమా అంటే అంద‌రికీ ఉండే అంచ‌నాల‌ను కూడా ఈ చిత్రం దాటేస్తుంది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వెళ్తే ఖచ్చితంగా అర‌వింద స‌మేత అల‌రిస్తుంది. ఎవ‌రేం అనుకున్నా కూడా తొలి 20 నిమిషాల సినిమా మాత్రం రోమాలు నిక్క‌బొడుచుకోవ‌డం అంటారు క‌దా అలా డిజైన్ చేసాడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్. అందుకే ఎన్టీఆర్ కెరీర్ లోనే కాదు.. తెలుగు ఇండ‌స్ట్రీలోనే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ది బెస్ట్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్స్ లో టాప్ 3లో ఉంటుంది అర‌వింద స‌మేత‌. ఈ 20 నిమిషాల టెంపోనే సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది. ఆ త‌ర్వాత కాస్త త‌గ్గినా సెకండాఫ్ తో మ‌ళ్లీ నిల‌బెట్టాడు మాట‌ల మాంత్రికుడు.

More Related Stories