English   

ఎన్టీఆర్ చైతన్య రథ సారధి వచ్చేశాడు

Kalyan Ram as Hari Krishna First Look Released in NTR Biopic ShootingKalyan Ram as Hari Krishna First Look Released in NTR Biopic Shooting
2018-10-12 09:11:07

ఎన్టీఆర్ బ‌యోపిక్ వార‌సుల‌తో నిండిపోతుంది. త‌మ పెద్ద వాళ్ల పాత్ర‌ల‌ను వార‌సులతోనే వేయిస్తున్నాడు క్రిష్. ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ కూడా వ‌చ్చేసాడు. 30 ఏళ్ల కింద బాల‌గోపాలుడులో బాబాయ్ తో బాలుడుగా నేను.. ఇప్పుడు ఆయ‌న నాన్న‌గారిగా బాబాయ్.. మా నాన్న‌గారిలా నేను అంటూ ట్విట్ట‌ర్ లో త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకున్నాడు క‌ళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో క‌ళ్యాణ్ రామ్ అడుగుపెట్టాడు. ఇందులో తండ్రి పాత్ర‌లో న‌టిస్తున్నాడు ఈయ‌న‌. షూటింగ్ కూడా మొద‌లైంది. ఈ మ‌ధ్యే ఈ పాత్ర‌కు టెస్ట్ క‌ట్ కూడా పూర్తి చేసాడు క్రిష్. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 25 రోజులు ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం డేట్లు ఇచ్చాడు క‌ళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ జీవితంలో చైతన్య‌ర‌థ యాత్ర కీల‌కం. అందుకే ఈ పాత్ర‌ను క‌ళ్యాణ్ రామ్ చేస్తున్నాడు.

Kalyan Ram as Hari Krishna First Look Released in NTR Biopic Shooting

అప్ప‌ట్లో ఆయ‌నే ఎన్టీఆర్ ను రాష్ట్ర‌మంతా తిప్పాడు. ఇప్పుడు ఇదే ర‌థంపై కొన్ని సీన్లు ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు క్రిష్. అది కూడా తెలంగాణ‌లో చాలా వ‌ర‌కు ఈ సీన్స్ చిత్రీక‌రించ‌నున్నాడు ద‌ర్శ‌కుడు. ఇక్క‌డ విచిత్రం ఏంటంటే నిజంగానే అప్పుడు చైత‌న్య రథంను ఇప్పుడు సినిమాలో వాడేస్తున్నారు. తండ్రి పోయిన త‌ర్వాత ఆయ‌న పాత్ర‌లో న‌టించ‌బోతుండ‌టంతో చాలా ఎమోష‌నల్ అవుతున్నాడు క‌ళ్యాణ్ రామ్. ఆయ‌న ఉన్న‌పుడు ఆ పాత్ర‌లో న‌టించ‌డం అంటే చిన్న విష‌య‌మే.. కానీ ఇప్పుడు మాత్రం గుండె బ‌రువెక్కుతున్న విష‌య‌మే. మ‌రి.. ఈ పాత్ర‌ను సినిమాలో క్రిష్ ఎంత‌వ‌ర‌కు తెర‌కెక్కిస్తాడో..? అన్న‌ట్లు ఇది మ‌హానాయ‌కుడు కోస‌మే.. క‌థానాయ‌కుడు కోసం కాదు.

More Related Stories