English   

ఎన్టీఆర్.. అస‌లు ఏంది ఈ ఉగ్రం..?

NTR’s High Performance in Aravinda Sametha
2018-10-12 09:43:29

నిన్ను న‌రికేవ‌ర‌కు తెలియ‌దు నాలో ఇంత కోపం ఉంద‌ని.. నీ గొంతులో క‌త్తి దించేవ‌ర‌కు తెలియ‌దు నాలో ఇంత ఉగ్రం దాగున్నాద‌ని అంటూ అర‌వింద స‌మేత‌లో ఓ డైలాగ్ చెబుతాడు ఎన్టీఆర్. నిజంగానే ఈ చిత్రంలో న‌వ‌ర‌సాల‌ను అవ‌పోస‌న ప‌ట్టేసాడు ఎన్టీఆర్. ఈ పాత్ర కోసం త‌న‌ను తాను ఎంత సిద్ధం చేసుకున్నాడంటే.. అస‌లు ఇది ఎన్టీఆర్ త‌ప్ప మ‌రొక‌రు చేయలేరేమో అనేంతగా ఇందులో ఒదిగిపోయాడు యంగ్ టైగ‌ర్. సినిమా ఎలా ఉంది అనే మాట ప‌క్క‌నబెట్టి ఒక్క‌సారి ఎన్టీఆర్ ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తే ఆయ‌న కెరీర్ లోనే బెస్ట్ ప‌ర్ఫామెన్స్ లో ఒక‌టిగా అర‌వింద స‌మేత నిలిచిపోతుంది. వీర రాఘ‌వ‌రెడ్డి పాత్ర‌లో ఆయ‌న న‌టించిన తీరు కూడా అలాగే ఉంది.

ముఖ్యంగా ఎమోష‌న‌ల్ సీన్స్ కు ప్రాణం పోసాడు ఎన్టీఆర్. తండ్రి చ‌నిపోయిన సీన్ అయితేనేమీ.. చనిపోయిన త‌ర్వాత ఆయ‌న తీర్చుకునే ప‌గ అయితేనేమీ.. ఆ త‌ర్వాత ఇంట‌ర్వెల్ సీన్ అయితేనేమీ.. సెకండాఫ్ లో వ‌చ్చే కాంప్ర‌మైజ్ సీన్ అయితేనేమీ.. ఒక్కో సీన్ లో ఒక్కోలా రెచ్చిపోయాడు ఎన్టీఆర్. ఫోన్ లో వార్నింగ్ ఇచ్చే సీన్ అయితే ఆయ‌న మాస్ ఇమేజ్ కు పీక్స్. ఇలా ప్ర‌తీ సీన్ అద్భుతంగా చేసాడు ఎన్టీఆర్. త్రివిక్ర‌మ్ కూడా క‌థ విష‌యం ప‌క్క‌నబెట్టి పూర్తిగా ఎన్టీఆర్ పై కాన్స‌ట్రేట్ చేసాడు. ఆ సీన్స్ అన్నీ అద్భుతంగా డిజైన్ చేసుకున్నాడు. ఓవ‌రాల్ గా సినిమా అబో యావ‌రేజ్ గానే ఉన్నా కూడా త‌న ప‌ర్ఫార్మెన్స్ తో సినిమాని రేంజ్ మార్చేసాడు యంగ్ టైగ‌ర్. మొత్తానికి అర‌వింద స‌మేత ఎన్టీఆర్ కు వ‌ర‌స‌గా ఐదో విజ‌యంలా క‌నిపిస్తుంది. ద‌స‌రా హాలీడేస్ కూడా ఉండ‌టంతో అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతాడు వీర‌రాఘ‌వుడు.

More Related Stories