English   

ఇన్నాళ్లూ ఎక్క‌డ దాచిపెట్టావ్ త్రివిక్ర‌మ్..? 

Trivikram
2018-10-12 11:52:21

జ‌ల్సా సినిమాలో కాసేపు ఫ్యాక్ష‌న్ చూపిస్తేనే వామ్మో త్రివిక్ర‌మ్ ఏంటి ఇలా చూపించాడు అనుకున్నారంతా. కానీ ఇప్పుడు సినిమా అంతా సీమ నేప‌థ్య‌మే. అస‌లు మొద‌లు నుంచి చివ‌రి వ‌ర‌కు అంతా రాయ‌ల‌సీమ‌లోనే క‌థ పుట్టి పెరిగి పూర్తైపోతుంది. అలాంటి క‌థ‌కు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడు అయితే ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి..? ఇప్పుడు అర‌వింద స‌మేత ఇలాగే ఉంది. అస‌లు ఇన్నాళ్లూ ఇంత క‌సి ఎక్క‌డ దాచేసాడో తెలియ‌దు కానీ నిజంగానే మాట‌ల మాంత్రికుడిలోని మ‌రో ద‌ర్శ‌కుడు బ‌య‌టికి వ‌చ్చాడు. యాక్ష‌న్ సీక్వెన్సులు చూస్తుంటే నిజంగానే ఒళ్లు గ‌గ్గుర పొడిచేలా తెర‌కెక్కించాడు. దానికితోడు ఎమోష‌న‌ల్ సీన్స్ కూడా త్రివిక్ర‌మ్ ఇంత బాగా తీస్తాడ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఎవ‌రికీ తెలియ‌దు.
 
ఎందుకంటే ఈయ‌న సినిమాల‌న్నీ ఇప్ప‌టి వ‌ర‌కు కామెడీ ప్లస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్లే. కానీ ఇప్పుడు మాత్రం రూట్ మార్చేసాడు త్రివిక్ర‌మ్. అర‌వింద స‌మేత కోసం పూర్తిగా త‌న‌ను తాను మార్చుకున్నాడు.. కొత్త త్రివిక్ర‌మ్ ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసాడు. అజ్ఞాత‌వాసి ఎఫెక్టో ఏమో కానీ అస‌లు ఆ ఛాయ‌లు కూడా ఇందులో క‌నిపించ‌లేదు. అసంద‌ర్భంగా వ‌చ్చే పాట‌లు కానీ.. బ‌లవంతంగా వ‌చ్చే కామెడీ సీన్లు కానీ లేవు. ఇక సీమ యాస ఈ చిత్రానికి మ‌రో ప్ల‌స్. అక్క‌డి డైలాగులు కూడా చాలా బాగా రాసుకున్నాడు త్రివిక్ర‌మ్. అంద‌రితోనూ అదే యాస మాట్లాడించి అద‌ర‌హో అనిపించాడు. ఓవ‌రాల్ గా ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా అర‌వింద స‌మేత‌ను ముస్తాబు చేసి పంపించాడు త్రివిక్ర‌మ్. తీరు చూస్తుంటే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఊచకోత కోసేలా క‌నిపిస్తున్నాడు వీర‌రాఘ‌వుడు. 

More Related Stories