English   

ఫణీంద్ర భూపతి వర్సస్ బసిరెడ్డి

Basi-Reddy
2018-10-12 18:37:00

ఒకప్పుడు హ్యాండ్సమ్ హీరోగా దుమ్మురేపిన స్టార్.. తర్వాత ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు పాత్రలోకి వచ్చాడు. అటుపై కొత్తగా వస్తోన్న కుర్రాళ్ల జోరులో వెనకబడిపోయాడు. అది మామూలుగా కాదు. ఓ రేంజ్ లో. ఇక జగపతిబాబు కెరీర్ అయిపోయింది అన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాల్సిందే అంటూ వెటకారాలాడారు. ఈ మాటలతో డిప్రస్ అయ్యాడు. కట్ చేస్తే ఓ రోజు విలన్ అవుతున్నా అన్నాడు. మ్యాన్లీస్టార్ ను విలన్ గా ఎవరు చూస్తారు అంటూ నవ్వారు. అతను అవి పట్టించుకోలేదు. కాస్త బెరుగ్గానే విలన్ అవతారం ఎత్తాడు. కట్ చేస్తే లెజెండ్ బ్లాక్ బస్టర్. ఆ సినిమాలో బాలయ్యకు సమానంగా జగ్గూభాయ్ కీ పేరొచ్చింది. అంతే.. ఆ తర్వాత అతను మోస్ట్ వాంటెడ్ విలన్ అయ్యాడు.

కానీ రొటీన్ విలనీస్ ఎన్ని చేస్తే ఏం ఉపయోగం. మళ్లీ విలన్ గా ‘ప్రూవ్’ చేసుకునే అవకాశం వచ్చింది. అతి తక్కువ మాటలతో కళ్లతోనే క్రౌర్యాన్ని పలికిస్తూ ‘రంగస్థలం’లో జగపతి చేసిన పాత్రకు కనెక్ట్ కానివాళ్లెవరు..? ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి ఆయన నటన అసమానం. అరే ఇలాంటి నటుడ్ని ఇన్నాళ్లూ ఎలా మిస్ అయ్యాం అనుకున్నారు చాలామంది. బట్ ఇప్పుడు ‘అరవింద సమేత వీరరాఘవ’లో బసిరెడ్డిగా కసిగా నటించి.. రంగస్థలం ను మించిన నటన చూపించాడు. 

ఫణీంద్ర భూపతి పాత్రకే చాలామంది అవార్డ్స్ వస్తాయనుకున్నారు. కానీ ఇప్పుడు బసిరెడ్డి పాత్ర అంతకు మించి అన్నట్టుగా ఉంది. యస్.. ఈ మూవీకి మెయిన్ పిల్లర్ ఎన్టీఆర్ అయితే ఆ పిల్లర్ ను ఎలివేట్ చేసిన పిల్లర్ జగపతిబాబు. తన పాత్ర తెలుసుకుని ఆహార్యాన్ని కూడా తనే అమర్చుకుని వచ్చాడని జగ్గూ గురించి త్రివిక్రమ్ చెప్పాడు. అంటే ఈ పాత్ర అతనికి ఎంతలా నచ్చి ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తంగా రంగస్థలం సినిమాకే  జగపతికి ఉత్తమ విలన్ గా ఎన్నో అవార్డ్స్ వస్తాయనుకున్నారు చాలామంది. కానీ ఇది అంతకు మించి ఉంది. కాబట్టి ఉత్తమ విలన్ కు పోటీ జగ్గూ వర్సస్ జగ్గూనే కాబోతోంది. అంటే ఫణీంద్ర భూపతి వర్సస్ బసిరెడ్డిఅన్నమాట. మరి ఈ ఇద్దరిలో విన్నర్ ఎవరవుతారో చూడాలి. 

More Related Stories