English   

ముగ్గురు భామలతో విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda
2018-10-12 20:03:25

టాలీవుడ్ లేటెస్ట్ సెన్షేషన్ విజయ్ దేవరకొండ ఊపుమీదున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఈ యేడాది రెండు సినిమాలు విడుదల చేశాడు. టైమ్ కుదరాలే కానీ.. మరో సినిమా టాక్సీవాలా కూడా వదిలేలా ఉన్నారు. కానీ ఈ సినిమా బాగా రాలేదనే కారణంతోనే ఆపేసినట్టు టాక్. ఆ విషయం వాళ్లు ఒప్పుకోవడం లేదు. అయినా ఆ సినిమా పూర్తి చేసిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఇతర ప్రాజెక్ట్స్ పై కాన్ సెంట్రేట్ చేస్తున్నాడు. వీటిలో గతంలో ఒప్పుకున్న సినిమాలే చాలా ఉణ్నాయి. అందులో ఒకటి కెఎస్ రామారావుతో చేయాల్సిని సినిమా. సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతిమాధవ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా. ఇక కొన్నాళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ ఉండదేమో అనుకున్నారు చాలామంది. కానీ లేటెస్ట్ గా మూవీ అఫీషియల్ గానే అనౌన్స్ అయింది. 

పెళ్లి చూపులు తర్వాతే విజయ్ దేవరకొండతో సినిమాకు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాడు నిర్మాత కెఎస్ రామారావు. అనుకోకుండా అతని క్రేజ్ అర్జున్ రెడ్డి అంతయింది. రీసెంట్ గా గీత గోవిందంతో సెంచరీ స్టార్ అయ్యాడు. ఈ నేపథ్యంలో మరీ లేట్ చేయడం కూడా బావోదు. అందుకే సినిమా అనౌన్స్ చేశారు. ఈ నెల 18 దసరా రోజున అఫీషియల్ గా ప్రారంభం కాబోతోందీ సినిమా. ఇక గీత గోవిందంతో విజయ్ కి బెస్ట్ ఆల్బమ్ ఇచ్చి మూవీ హిట్ లో మేజర్ షేర్ తీసుకున్న గోపీ సుందరే ఈ చిత్రానికీ సంగీత దర్శకుడు. ఇదే మ్యూజిక్ డైరెక్టర్ గతంలో క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేసిన మళ్లీమళ్లీ ఇది రానిరోజుకూ సంగీతం అందించాడు. అలా ఇద్దరికీ కామన్ గా ఉన్నాడు గోపీ సుందర్.

ఇక ఆశ్చర్యం ఏంటంటే.. ఈ సినిమాలో విజయ్ దేవరకొం సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు. రాశిఖన్నా మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. తెలుగు నేటివిటీ ఉన్న తమిళ్ డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్. మరి హీరోయిన్నా కాదా అనేది తెలియదు కానీ.. ఇషబెల్లా అనే మరో భామ కూడా ఉందని చెప్పారు. మరి ఇది ఏ తరహా కథ అనేది ఇప్పుడు తెలియదు కానీ.. మొత్తంగా ఈ యారోగెంట్ రౌడీతో సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకున్న క్రాంతిమాధవ్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. 

More Related Stories