English   

అరవిందుడి లెక్క శానా ఉండాది ఓభా.. 

Aravinda-Sametha
2018-10-12 21:07:58

వరుస విజయాలతో దూసుకుపోతోన్న జూనియర్ ఎన్టీఆర్ కు అరవింద సమేత సరికొత్త ఎక్స్ పీరియన్స్ నిస్తోంది. అందుకే ఎన్నడూ లేనంతగా తను కూడా ట్విట్టర్ లో ఎగ్జైట్ అయిపోతున్నాడు. అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాడు. అంటే తను ఈ సినిమాను ఎంత ప్రేమించాడు.. ఎంత నమ్మకం పెట్టుకున్నాడు అనే విషయం తెలుస్తోంది. మొత్తంగా ఈ మూవీ ఫస్ట్ డే చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డ్స్ కొట్టేసింది. అటు ఓవర్శీస్ లో కూడా ఓ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తోంది. ఇక వచ్చేది వీకెండ్ కాబట్టి ఓవర్శీస్ లో ఎన్టీఆర్ కెరీర్ లో ఇదే బెస్ట్ మూవీ అయ్యే అవకాశాలూ ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతోందని తెలుస్తోంది. ఈ పది రోజులు దసరా శెలవులు మొత్తం అరవిందుడే ఆక్యుపై చేస్తున్నాడు. అయితే సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా భారీగానే అమ్మారు కాబట్టి.. ఆ వైపు నుంచి నిర్మాతకు మిగిలే పర్సెంటేజ్ తక్కువే. బట్.. ఆ లెక్కను మరోలా సరిచేస్తున్నాడు నిర్మాత రాధాకృష్ణ. 

ఏ నిర్మాతకైనా తన ప్రాజెక్ట్ పై నమ్మకం ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా అతని నమ్మకం నిలబడుతుంది. అందుకు ఉదాహరణ.. హారిక హాసిని బ్యానర్ అధినేత ఎస్. రాధాకృష్ణ. ఆ నమ్మకంతోనే ఆయన తన సినిమా శాటిలైట్ రైట్స్ అమ్మలేదు. అయినా మొదట్లో 20కోట్ల వరకూ ఆఫర్ వచ్చిందట. కానీ అతను సినిమాపై నమ్మకంతో రిజల్ట్ తెలిసిన తర్వాతే అమ్ముదాం అని ఆగాడు. అతని నమ్మకం నిలబడింది. 32.5కోట్లకు జీ టివి వాళ్ళు ఈ సినిమాను కొన్నారు. నిజానికి సినిమా టాక్ లో ఏ మాత్రం తేడా వచ్చినా మొత్తానికే మోసం వస్తుంది. కానీ రాధాకృష్ణ తన ప్రాజెక్ట్ ను నమ్మాడు. ఇక ఈ శాటిలైట్ తెలుగులోనే కాదు.. మొత్తం జీ నెట్ వర్స్ అన్నిటికీ వర్తిస్తుంది. ఎన్టీఆర్ యాక్షన్ సినిమాలను నార్త్ లో బాగా చూస్తారు. కాబట్టి జీ నెట్ వర్క్ అంత కాస్ట్ పెట్టగలిగింది. ఇంకా ఈ మూవీకి సంబంధించి డబ్బింగ్ రైట్స్ తో పాటు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా అమ్మాల్సి ఉంది. ఆ రెండిటి ద్వారా ఎంత లేదన్నా.. మరో 20-25కోట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే అరవిందుడి లెక్క దండిగానే ఉందన్నమాట. 

More Related Stories