English   

అర‌వింద స‌మేత‌పై దాడిచేస్తున్న పైర‌సీ ర‌క్క‌సి

Aravinda Sametha Full Movie Piracy Copy Leaked Online
2018-10-13 09:26:54

పైర‌సీ.. ఇండ‌స్ట్రీ ఏదైనా నిర్మాత‌ల‌ను నిద్ర పోనీకుండా చేస్తున్న ప‌దం ఇది. కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు చేసి చేసిన సినిమాల‌ను విడుద‌లైన రోజు సాయంత్రానికే నెట్ లో పెట్టేస్తున్నారు కొంద‌రు. మిగిలిన ఇండ‌స్ట్రీలతో పోలిస్తే త‌మిళ‌నాట ఈ పైర‌సీ ర‌చ్చ ఎక్కువ‌గానే ఉంది. ఇక ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో కూడా ఇదే జ‌రుగుతుంది. కంటికి క‌నిపించే శ‌త్రువుల‌తో ఎంత పెద్ద యుద్ధం అయినా చేయొచ్చు కానీ క‌నిపించ‌ని శ‌త్రువుతో స‌మ‌రం సాగించ‌డం చాలా క‌ష్టం. ఇప్పుడు అర‌వింద స‌మేత కూడా అన్ని సినిమాల మాదిరి ఇదే చేస్తుంది. ఈ సినిమాను కూడా పైర‌సీ ర‌క్క‌సి ప‌ట్టేసింది. విడుద‌ల రోజే అన్ని సైట్ల‌లో ఫుల్ సినిమా పెట్టేసారు. అది త‌ట్టుకుని కూడా ఇప్పుడు సినిమా హౌజ్ ఫుల్స్ తెచ్చుకుంటుంది. అస‌లు ఎందుకు ఈ పైర‌సీ ఇంతగా పెరిగిపోతుంద‌నే విష‌యంపై ఆ మ‌ధ్య త‌మిళ డిస్ట్రిబ్యూట‌ర్  తిరంపూర్ సుబ్ర‌మ‌ణ్యం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

నిర్మాత‌లే పైరసీకి స‌గం కార‌ణం అవుతున్నారంటూ చెప్పుకొచ్చారాయ‌న‌. ఓవ‌ర్సీస్ హ‌క్కుల‌కు ఆశ‌ప‌డి త‌మ‌కు తెలియ‌ని దేశాల‌కు సినిమాల‌ను అమ్మేస్తున్నారని.. వాళ్ల నుంచి కంటెంట్ ను కొంద‌రు పైర‌సీ సైట్లు న‌డిపించే వాళ్లు భారీ మొత్తం కొంటున్నార‌ని.. అలా విడుద‌లైన రోజు సాయంత్ర‌మే సినిమాల‌ను నెట్ లో పెట్టేస్తున్నార‌ని చెబుతున్నాడు తిరంపూర్ సుబ్ర‌మ‌ణ్యం. ఆలోచిస్తుంటే ఈయ‌న చెప్పిన దాంట్లో కూడా నిజం లేక‌పోలేదు. నిర్మాత‌ల‌కు మ‌రీ అంత డ‌బ్బు ఆశ‌ కూడా ప‌నికిరాదు క‌దా..! అస‌లు ఆ దేశంలో త‌మ సినిమా చూస్తారో లేదో కూడా తెలియ‌కుండా రైట్స్ కోసం సినిమాను అమ్మేస్తే ఇలాంటి ప‌రిస్థితులే వ‌స్తాయి మ‌రి..!

More Related Stories