English   

అర‌వింద రెండోరోజు ప‌రిస్థితేంటి..?

Aravinda Sametha Two Days Worldwide Box Office Collections
2018-10-13 11:04:30

అర‌వింద స‌మేత రికార్డుల‌పై ఎవ‌రికీ అనుమానాలు లేవు. ఈ సినిమా రికార్డుల‌తో చెడుగుడు ఆడేసుకుంది. ఓవ‌రాల్ గా లేదు కానీ తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు అజ్ఞాత‌వాసిని కూడా దాటేసి రెండో స్థానంలో ఉంది అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌. ఏకంగా తొలిరోజు 36 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. మ‌రి ఇదే జోరు రెండో రోజు కూడా కొన‌సాగిందా.. లేదంటే ఏదైనా ప‌డిపోయిందా అనే అనుమానాలు అభిమానులతో పాటు ట్రేడ్ స‌ర్కిల్స్ లోనూ క‌నిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం బాక్సాఫీస్ ను వీర‌రాఘ‌వుడు కుమ్మేస్తున్నాడు. అస‌లు ఈయ‌న దూకుడు ముందు వీకెండ్ రికార్డులేవీ మిగిలేలా క‌నిపించ‌డం లేదు. ఒక్కో రికార్డును తుంచి సంచిలో వేసుకుని వెళ్తున్నాడు. రెండోరోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 10 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింద‌ని తెలుస్తుంది.

తొలిరోజుతో పోలిస్తే త‌క్కువే కానీ ఇంత మెయింటేన్ చేయ‌డం మాత్రం చాలా పెద్ద విష‌యం. మ‌న ద‌గ్గ‌ర 70 కోట్ల‌కు పైగా బిజినెస్ చేసింది ఈ చిత్రం. ఇప్ప‌టికే 27 కోట్లు వ‌చ్చాయి.. క‌చ్చితంగా వారం రోజుల త‌ర్వాత చాలా ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ రావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా కూడా క‌లెక్ష‌న్లు మాత్రం కుమ్మేస్తున్నాయి. ఎన్టీఆర్ ప్ర‌తీ సినిమాకు జ‌రిగేది ఇదే.. కాక‌పోతే మూడేళ్లుగా ఇది ఎక్కువ‌గా జ‌రుగుతుంది. ప్ర‌తీ సినిమా యావ‌రేజ్ గానే మొద‌లై.. క‌మ‌ర్షియ‌ల్ గా పెద్ద స్థాయికి వెళ్తుంది. జై ల‌వ‌కుశ 75 కోట్లు వ‌సూలు చేస్తే.. ఇప్పుడు అర‌వింద స‌మేత ఈజీగా 100 కోట్లు క‌లెక్ట్ చేసేలా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతానికి ఈ చిత్రం బాక్సాఫీస్ ను పూర్తిగా ద‌త్త‌త తీసుకుంది. ఇప్ప‌ట్లో అడ్డొచ్చే సినిమా కూడా లేదు. అందుకే క‌మ‌ర్షియ‌ల్ గా ర‌చ్చ త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

More Related Stories