English   

ఎన్టీఆర్ మెగా హీరోల రికార్డు బ్రేక్ చేస్తాడా..?

NTR’s Aravinda Sametha Will Beats Mega Heroes Record?
2018-10-14 08:11:34

100 కోట్ల క‌ల ఇప్ప‌టి వ‌ర‌కు బాహుబ‌లి కాకుండా తెలుగు ఇండ‌స్ట్రీలో అందుకున్న‌ది ఇద్ద‌రే ఇద్ద‌రు హీరోలు. ఆ ఇద్ద‌రు కూడా మెగా ఇంట్లోంచి వ‌చ్చిన వాళ్లే. ఒక‌రు చిరంజీవి.. మ‌రొక‌రు రామ్ చ‌ర‌ణ్. తండ్రీ కొడుకులే 100 కోట్ల షేర్ అందుకున్నారు. ఇందులో చిరంజీవి ఖైదీ నెం.150తో ప‌దేళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చి 105 కోట్లు వ‌సూలు చేస్తే.. ఈ ఏడాది రంగ‌స్థ‌లంలో 126 కోట్లు వ‌సూలు చేసాడు చ‌ర‌ణ్. ఇక ఇప్పుడు ఈ రెండు రికార్డుల‌పై ఎన్టీఆర్ క‌న్ను ప‌డింది. మెగా కుటుంబానికి త‌ప్ప మ‌రో హీరోకు సాధ్యం కాని ఈ రికార్డుపై ఇప్పుడు అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ క‌న్నేసాడు. ఈ సినిమాకు ద‌స‌రా హాలీడేస్ క‌లిసొస్తున్నాయి. ఏకంగా రెండు రోజుల్లోనే 50కోట్ల షేర్ సాధించేసింది అర‌వింద స‌మేత‌.

దాంతో ఈజీగా మ‌రో 50 కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా షేర్ కూడా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. రెండో రోజు కంటే మూడో రోజు మ‌రింత ఎక్కువ‌గా వ‌చ్చేలా క‌నిపిస్తుంది షేర్. ఇప్ప‌టికే గ్రాస్ 80 కోట్లు దాటేసింది. ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే మూడో రోజుకు 120కోట్ల వ‌ర‌కు వ‌చ్చేలా క‌నిపిస్తుంది. ఓవ‌రాల్ గా త్రివిక్ర‌మ్ స్టామినా.. ఎన్టీఆర్ ఇమేజ్ క‌లిపి చిరంజీవి ఖైదీ నెం.150 రికార్డ్ ఈజీగా ఎగిరిపోయేలా క‌నిపిస్తుంది. అయితే రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం రికార్డ్ మాత్ర‌మే కాస్త ఆల‌స్యం అయ్యేలా ఉంది. స్ట‌డీగా సాగిందంటే ఈ రికార్డ్ కూడా అర‌వింద స‌మేత అందుకోవ‌డం పెద్ద క‌ష్టం కాక‌పోవ‌చ్చు. మ‌రి చూడాలిక‌.. చివ‌రి వ‌ర‌కు ఏం జ‌రుగుతుందో..? మ‌రో ప‌ది రోజులు ఆగితే సెల‌వులు అయిపోతాయి.. అప్ప‌టి వ‌ర‌కు అర‌విందుడి దూకుడు కూడా త‌గ్గుతుంది. అప్పుడు తీరిగ్గా కూర్చుని లెక్క‌లు తేల్చుకోవ‌చ్చు.

More Related Stories