English   

స‌ల్మాన్ రేప్ చేసాడంటోన్న హీరోయిన్

Salman Khan Sexually Harassed Said Pooja Mishra
2018-10-14 08:44:28

నాకేం తెలియ‌దు.. ఇప్ప‌టికీ నేను వ‌ర్జిన్ నే అని చెప్పుకుంటుంటాడు స‌ల్మాన్ ఖాన్. కానీ ఇప్పుడు ఈయ‌న వ‌ర్జిన్ కాదు.. చాలా మంది అమ్మాయిల జీవితాల‌తో ఆడుకున్నాడు అంటుంది ఓ హీరోయిన్. బిగ్ బాస్ సీజ‌న్ 5లో పాల్గొన్న పూజామిశ్రా ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు చేసింది. దేశవ్యాప్తంగా అన్ని ఇండ‌స్ట్రీల‌ను కుదిపేస్తున్న మీటూ సమ‌స్య ఇది. ఇందులో ఇప్పుడు స‌ల్మాన్ ను కూడా లాగేసారు. ఇన్నాళ్లూ ఏ స్టార్ హీరోపై ఏ హీరోయిన్ కూడా ఆరోప‌ణ‌లు చేయ‌లేదు. ఇప్పుడు పూజా మాత్రం తొలిసారి స‌ల్మాన్ ను పేరు పెట్టి మ‌రీ ర‌చ్చ చేస్తుంది. త‌న‌ను సుల్తాన్ షూటింగ్ టైమ్ లో హోట‌ల్ గ‌దిలో రేప్ చేసాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

మ‌రోవైపు ఆయ‌న‌తో పాటు అత‌డి త‌మ్ముళ్లు అర్బాజ్, సోహైల్ ఖాన్ లు కూడా త‌న‌ను లైంగికంగా వాడుకున్నార‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. స‌ల్మాన్ బ్ర‌ద‌ర్సే కాదు.. శ‌త్రుఘ్న సిన్హా సైతం త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని ఆమె చెప్ప‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి పూజా క‌మెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి. అయితే ఈ విష‌యంపై మిగిలిన వాళ్లు మాత్రం స్పందించ‌డం లేదు. ఫ్యాన్స్ మాత్రం స‌ల్మాన్ అలాంటివాడు కాదంటున్నారు. మ‌రి.. ఈ ఇష్యూ ఎంత దూరం వెళ్తుందో..?

More Related Stories