English   

త‌ప్పులు దిద్దుకుంటా.. మీ సాయిధ‌ర‌మ్ తేజ్..!

Sai Dharam Tej Analysing Flops Open Letter For Fans
2018-10-14 09:53:36

సాయిధ‌ర‌మ్ తేజ్ చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. అయితే ప్ర‌త్య‌క్షంగా మాత్రం కాదు.. లెట‌ర్ రూపంలో. ఆయ‌న త‌న ఫ్యాన్స్ కోసం ఓ లేఖ రాసాడు. అందులో చాలా అర్థ‌మే ఉంది. త‌న ఫ్లాపుల గురించి కూడా అందులో రాసుకున్నాడు సాయి. చేసిన త‌ప్పుల గురించి కూడా ఆ లెట‌ర్ లో చెప్పాడు ఈ హీరో. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా ఇన్నాళ్లూ నా వెంటే న‌డుస్తూ.. న‌న్ను అనుక్ష‌ణం ప్రోత్స‌హిస్తూ.. వెన్నంటే ఉన్న అభిమానులంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు. ఈ మ‌ధ్య కాలంలో మీ అంచ‌నాలు అందుకోలేక‌పోయినందుకు న‌న్ను క్ష‌మించండి.. అంటూ మొద‌లు పెట్టి విజ‌యం వ‌చ్చిన‌పుడు చ‌ప్ప‌ట్లు కొట్టి.. ఫ్లాపులు వ‌స్తే చ‌ప్ప‌ట్లు కొట్ట‌కుండా ఉండ‌లేద‌ని ఎప్పుడూ త‌న వెంట‌నే ఉన్నందుకు కృత‌జ్ఞతలు అని చెప్పాడు సాయిధ‌రమ్ తేజ్.

ఇక ఈ మ‌ధ్య వ‌చ్చిన ఫ్లాపుల గురించి చెబుతూ దీనికి గ‌ల కార‌ణాల‌ను విశ్లేషించుకుంటున్నాను. మీ స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుని చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుంటూ న‌న్ను నేను కొత్త‌గా ఆవిష్క‌రించుకునే ప‌నిలోనే ఉన్నాను. ఇప్ప‌టికీ మీరు నా వెంట ఉన్నార‌నే ధైర్యంతోనే మ‌రింత బ‌లంగా.. మాన‌సిక స్థైర్యంతో ఉన్నాన‌ని గుర్తు చేసుకున్నాడు. మ‌రిన్ని మంచి సినిమాల‌తో మీ ముందుకు రాబోతున్నాను. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ మీ అభిమానానికి నా మ‌నఃపూర్వ‌క కృత‌జ్ఞత‌లు. మీరు నాపై చూపించే ఈ అభిమాన‌మే నాలో ఇంకా మాన‌సికంగా ఉత్సాహం పెంచేస్తుంది. మంచి సినిమాలు చేయ‌డానికి ప్రోత్సాహాన్నిస్తుందని తెలిపాడు మెగా మేన‌ల్లుడు.

త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ప‌లుచోట్ల అభిమానులు కేక్ క‌ట్టింగ్ చేస్తామ‌ని చెప్పారని.. కానీ నా పుట్టిన‌రోజుకు అలా కేక్ క‌ట్టింగ్స్.. పార్టీల కోసం ఖ‌ర్చు చేసే డ‌బ్బుల‌తో ఎవ‌రైనా చిన్నారి చ‌దువుకు ఉప‌యోగించండని అభిమానుల‌ను కోరాడు ఈ హీరో. అలా చేస్తే తాను ఇంకా ఆనందిస్తానని చెప్పాడు. అని చివ‌ర‌గా ఎల్ల‌ప్ప‌టికీ మీ అభిమానం కోరుకునే.. మీ సాయిధ‌ర‌మ్ తేజ్ అంటూ లేఖ‌ను ముగించాడు ఈ హీరో. అక్టోబ‌ర్ 15న సాయిధ‌ర‌మ్ తేజ్ పుట్టిన‌రోజు. ప్ర‌స్తుతం ఈయ‌న చిత్ర‌ల‌హ‌రి సినిమాకు క‌మిట‌య్యాడు. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌కుడు. త్వ‌ర‌లోనే ఇది ప‌ట్టాలెక్క‌నుంది.

More Related Stories