English   

దిల్ రాజుకు షాక్ ఇచ్చిన బిఏ రాజు

Senior Film PRO BA Raju Shocking Question to Dil Raju
2018-10-14 20:10:54

అవును.. ఇదే జ‌రిగింది మ‌రి. ఏ నిర్మాత అయినా కూడా త‌న సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని చెప్తాడు. కానీ దిల్ రాజు మాత్రం త‌న సినిమా జ‌స్ట్ ఆడితే చాలంటున్నాడు. ఎందుకు దిల్ రాజు త‌న సినిమా ఆడితే చాలంటున్నాడు అనుకుంటున్నారా..? ఉంది.. ఇక్క‌డే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఎందుకంటే ఈయ‌నే నైజాంలో అర‌వింద స‌మేత విడుద‌ల చేసాడు. ఇదొచ్చిన వారం రోజుల‌కే హ‌లో గురు ప్రేమ‌కోస‌మే వ‌స్తుంది. అక్టోబ‌ర్ 18న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇది కూడా పూర్తిగా దిల్ రాజు విడుద‌ల చేస్తున్నాడు. అదే స‌మ‌యంలో అర‌వింద స‌మేత క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తున్న స‌మ‌యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.

అక్క‌డ పిఆర్ఓ బిఏ రాజు అర‌వింద స‌మేత ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు అదిరిపోయే ప్ర‌శ్న వేసాడు. వారం రోజుల్లో మీ సినిమా హ‌లో గురు ప్రేమ‌కోస‌మే విడుద‌లవుతుంది క‌దా.. మ‌రి ఆ సినిమా హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నారా.. అర‌వింద స‌మేత క‌లెక్ష‌న్ల‌కు దెబ్బ ప‌డుతుంది క‌దా అని అడిగాడు. దాంతో త్రివిక్ర‌మ్ షాక్ అయిపోయాడు. రాజుగారు మీరు ఉండాల్సిన వాళ్లండీ బాబూ అంటూ సెటైర్ వేసాడు. ఇక దిల్ రాజు అయితే హ‌లో గురు ప్రేమ‌కోస‌మే జ‌స్ట్ హిట్ అయితే చాలు.. అర‌వింద స‌మేత మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ కావాల‌న్నాడు. ఎందుకంటే హ‌లో గురు ప్రేమ‌కోస‌మే మొత్తం బిజినెస్ కంటే అర‌విందుడి నైజాం మార్కెట్ ఎక్కువ‌. మొత్తానికి ఆ రాజు ఈ రాజుకు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చాడు.

More Related Stories