English   

మ‌ళ్ళీ విడుద‌లవుతున్న భ‌ర‌త్ అనే నేను

Mahesh’s Bharat Ane Nenu Hindi Dubbed Version Coming on YouTube
2018-10-14 21:08:39

విడుద‌లైన సినిమా మ‌ళ్లీ విడుద‌ల కావ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అయినా ఈ రోజుల్లో సింగిల్ రిలీజ్ చేస్తుంటేనే ప్రేక్ష‌కులు చూడటం లేదు ఇక రెండో రిలీజ్ కూడానా అనుకుంటున్నారా..? క‌న్ఫ్యూజ‌న్ అవ‌స‌రం లేదు.. మొన్న విడుద‌లైంది తెలుగులో.. ఆ త‌ర్వాత విడుద‌లైంది త‌మిళ్ లో. ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైంది హిందీలో. అక్క‌డ మ‌హేశ్ కు ఫ్యాన్స్ ఉన్నారు.. ఇమేజ్ ఉంది.. మార్కెట్ ఉంది. దాంతో హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. కాక‌పోతే థియేట‌ర్స్ లో కాదు.. యూ ట్యూబ్ లో మాత్ర‌మే. ఉత్త‌రాదిన కూడా వ‌ర‌స‌గా మ‌హేష్ సినిమాలు విడుద‌ల‌వుతుంటాయి. పైగా గ‌తేడాది స్పైడ‌ర్ కూడా అక్క‌డ విడుద‌లైంది.

దాంతో మ‌హేష్ సినిమాల‌కు మంచి గుర్తింపే ఉంది అక్క‌డ‌. కొర‌టాల శివ తెర‌కెక్కించిన భ‌ర‌త్ అనే నేను ఇప్ప‌టికే త‌మిళ్ లో విడుద‌లైంది. ఇప్పుడు హిందీ వ‌ర్ష‌న్ విడుద‌ల చేస్తున్నారు. భ‌ర‌త్ ది గ్రేట్ లీడ‌ర్ పేరుతో అక్క‌డ ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేసారు ఇప్పుడు. ఖచ్చితంగా ఈ చిత్రం యూ ట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంద‌ని న‌మ్ముతున్నారు బ‌య్య‌ర్లు. మ‌న సినిమాల‌కు క‌నీసం కోటి వ్యూస్ కంటే త‌క్కువ రావ‌డం లేదు. అందుకే ఫుల్ ఖుషీగా క‌నిపిస్తున్నారు వాళ్లు. పొలిటిక‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ కావ‌డంతో యూ ట్యూబ్ లో బాగానే ఎక్కుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రి.. మ‌హేష్ యూ ట్యూబ్ లో ఎంత వ‌ర‌కు స‌త్తా చూపిస్తాడో..?

More Related Stories