English   

నానికి ఫ్లాప్ ద‌ర్శ‌కున్ని ఇస్తున్న అల్లు అర‌వింద్

Natural Star Nani Will Work With Srikanth Addala Produced by Allu Aravind
2018-10-15 08:12:26

అల్లు అర‌వింద్ చేయి ప‌డిందంటే చాలు ఆ ద‌ర్శ‌కుడి పంట పండుతుంది. ఫ్లాప్ ఇచ్చిన వాళ్లు కూడా ఎందుకో తెలియ‌దు కానీ గీత ఆర్ట్స్ లోకి వ‌చ్చే స‌రికి హిట్ ఇచ్చేస్తుంటారు. ప‌రుశురామ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక ఇప్పుడు మ‌రో ఫ్లాప్ డైరెక్ట‌ర్ కు కూడా గీతాఆర్ట్స్ చేయూతనిస్తుంద‌ని తెలుస్తుంది. అత‌డే శ్రీ‌కాంత్ అడ్డాల‌.. ఈయ‌న మంచికి కేరాఫ్ అడ్ర‌స్. రెండేళ్ల‌ కింది వ‌ర‌కు ఈ పేరు టాలీవుడ్ లో బాగా వినిపించింది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో రెండోసారి అవ‌కాశం ద‌క్కించుకోవ‌డం అంటే మాట‌లు కాదు. ఎంతో న‌మ్మితే గానీ ఆయ‌న మ‌రో అవ‌కాశం ఇవ్వ‌డు. రెండోసారి అవ‌కాశ‌మిస్తే ద‌ర్శ‌కులు ఆయ‌న్ని ముంచేస్తున్నారు అది వేరే విష‌యం. ఇప్పుడు శ్రీ‌కాంత్ అడ్డాల కూడా ఇదే చేసాడు.

బ్ర‌హ్మోత్స‌వంతో మహేష్ కు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని డిజాస్ట‌ర్ ని ఇచ్చాడు శ్రీ‌కాంత్ అడ్డాల‌. త‌న‌కే అర్థ‌మ‌య్యే డైలాగ్స్.. ప్రేక్ష‌కుల‌కు అర్థం కాని సీన్ల‌తో చిరాకు పుట్టించాడు. బ్ర‌హ్మోత్స‌వం సినిమాపై భారీ ఆశ‌లు పెట్టుకున్న శ్రీ‌కాంత్ అడ్డాల‌కి ఆ సినిమా కోలుకోలేని దెబ్బ తీసింది. బ్ర‌హ్మోత్స‌వం ఫ్లాప్ కు క‌ర్త క‌ర్మ క్రియ అన్నీ శ్రీ‌కాంత్ అడ్డాలే. సీత‌మ్మ వాకిట్లో లాంటి హిట్టిచ్చాడ‌నే న‌మ్మ‌కంతో క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు అన్నీ ఆయ‌న‌పైనే గుడ్డిగా వ‌దిలేసాడు సూప‌ర్ స్టార్. కానీ ఈ సినిమాకు ఆయ‌న ప‌డిన క‌ష్ట‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరైంది. పైగా మహేష్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసాడంటూ ఇప్పుడు శ్రీ‌కాంత్ అడ్డాల‌పై చివాట్లు కూడా ప‌డుతున్నాయి. ఈ సినిమా వ‌చ్చి రెండేళ్లు దాటినా ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ఈయ‌న పేరు ఎక్క‌డా వినిపించ‌డం లేదు.

ముకుంద ప్లాప్ అయినా కూడా అది మంచి సినిమా అంటే ఓ వ‌ర్గం ప్రేక్ష‌కులు మెచ్చుకున్నారు. కానీ కెరీర్ లో ఫ‌స్ట్ టైమ్ చెత్త సినిమా చేసాడంటూ ఈ ద‌ర్శ‌కున్ని విమ‌ర్శిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఈయ‌న‌కు త‌ర్వాతి సినిమా ఇచ్చే ధైర్యం ఏ హీరో చేస్తాడు..? అయితే ఇప్ప‌టికే మెగా కంపౌండ్ లో శ్రీ‌కాంత్ అడ్డాల‌కు ఓ అవ‌కాశం వ‌చ్చింది. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో నాని హీరోగా ఈయ‌న ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ముందు ఈ చిత్రంలో శ‌ర్వానంద్ హీరోగా అనుకున్నా కూడా ఎందుకో కానీ నాని వ‌చ్చాడు. ఫ్లాప్ ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డంలో అల్లు అర‌వింద్ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇప్పుడు శ్రీ‌కాంత్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఇదే కానీ నిజ‌మైతే మాత్రం ఇప్పుడు శ్రీ‌కాంత్ అడ్డాల కంటే ల‌క్కీ డైరెక్ట‌ర్ మ‌రొక‌రు ఉండ‌రు.

More Related Stories