English   

చిరంజీవిపై ఆ నిర్మాత అలిగాడా..?

Ashwini-dutt
2018-10-15 12:28:25

కొన్ని కాంబినేషన్స్ ఎవర్ గ్రీన్ అనిపించుకుంటాయి. అయితే ఈ ట్రెండ్ 80,90లలో ఉన్నంతగా ఈ మధ్య ఉండటం లేదు. బాండింగ్ కంటే బిజినెస్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ 2000ల తర్వాత టాలీవుడ్ లో ఓ బ్యాడ్ ఫేజ్ స్టార్ట్ అయింది. అప్పుడు అప్పటికే పెద్ద నిర్మాతలు, పెద్ద నిర్మాణ సంస్థలు అనుకున్నవాళ్లంతా కామ్ అయిపోయారు. నిర్మాతకు మర్యాద పోయింది అనుకున్న పాతకాలం ప్రొడ్యూసర్స్ అంతా ఆల్మోస్ట్ కామ్ అయిపోయారు. అడపాడదపా.. అశ్వనీదత్, అల్లు అరవింద్ వంటి వారు సినిమాలు చేస్తూ వచ్చారు. చేస్తున్నారు. అయితే అల్లు అరవింద్ సక్సస్ అయినంతగా అశ్వనీదత్ కాలేకపోయాడు. ఆ మధ్య వరుస డిజాస్టర్స్ తో ఢీలా పడ్డాడు. లేటెస్ట్ గా దేవదాస్ తో మళ్లీ ఆయన ఫేస్ లో కాస్త నవ్వులు పూశాయి. అటు కూతుళ్లు కూడా నిర్మాతలుగా సక్సస్ కావడంతో మాగ్జిమం హ్యాపీగానే ఉన్నాడు. అయితే రీసెంట్ గా అతను చిరంజీవితో సినిమా విషయంలో ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీని వెనక ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇలా సడెన్ గా ఆ మూవీ గురించి ట్వీటేయడం మాత్రం అనుమానాలు రేకెత్తించింది. 

నిజానికి అశ్వనీదత్.. చిరంజీవితో సినిమా చేయాలని చాలాకాలంగా వెయిట్ చేస్తున్నాడు. కానీ కుదరడం లేదు. అప్పట్లో చిరు పొలిటికల్ ఎంట్రీతో ఆశలు వదులుకున్నా.. తిరిగి వచ్చిన తర్వాత చిరుతో సినిమా కోసం తిరుగుతూనే ఉన్నాడు అశ్వనీదత్. కానీ ఆయన మాత్రం ఏదీ తేల్చలేదు. పైగా కొడుకు రామ్ చరణ్ నిర్మించిన సినిమాలు చేస్తున్నాడు. సరే కొడుకు కదా అనుకున్నాడు. బట్ రీసెంట్ గా కొరటాల శివతో సినిమాను రామ్ చరణ్ తో పాటు నిరంజన్ రెడ్డి అనే మరో ప్రొడ్యూసర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. దీంతో అశ్వనీదత్ అలిగాడని టాక్. 

చిరంజీవితో నాలుగు సినిమాల చేశాడు అశ్వనీదత్. ఈ నాలుగూ హిట్లే. వీటిలో జగదేవకవీరుడు అతిలోక సుందరి వంటి మెగా ఆల్ టైమ్ హిట్ కూడా ఉంది. అందుకే తనకు అవకాశం ఇస్తాడనుకున్నాడు అశ్వనీదత్. కానీ చిరు హ్యాండ్ ఇచ్చాడని.. ఇలా ఇకపై తను చిరంజీవితో సినిమా చేసే అవకాశాలు సన్నగిల్లాయనే కోపంతోనే మేం ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేయడం లేదని ట్వీటారు. మేం చిరంజీవితో నెక్ట్స్ ఫిల్మ్ చేయడం లేదు. చిరంజీవితో మా బ్యానర్ లో నాలుగు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాం.. ఐదో బ్లాక్ బస్టర్ కు సంబంధించిన వార్తల్ని మేమే చెబుతాం. అది కూడా గర్వంగా అనౌన్స్ చేస్తాం అని చెప్పారు. నిజానికి ఇప్పుడు చిరంజీవి 152వ సినిమాపై అశ్వనీదత్ మెగా హోప్స్ పెట్టుకున్నారు. అవి కొలాప్స్ కావడంతో కవర్ చేస్తూ ఇలా అన్నా.. నిజానికి ఆయన చిరంజీవిపై అలిగారని.. కాస్త కోపంనే ఉన్నారని కూడా చెప్పుకుంటున్నారు. లేదంటే సడెన్ గా చిరంజీవి 152వ సినిమా అనౌన్స్ అయిన వెంటనే అశ్వనీదత్ బ్యానర్ ఇలా స్పందించడమేంటీ..?

More Related Stories