English   

అర‌వింద స‌మేత వివాదం.. ఇదెక్క‌డి న్యాయం..? 

Aravinda-Sametha
2018-10-15 14:14:39

ఈ రోజుల్లో కాంట్ర‌వ‌ర్సీ లేని సినిమాలే లేవు. స్టార్ హీరో సినిమా విడుద‌లైందంటే చాలు.. ఏదో ఓ వివాదం వెంటేసుకుని కొంద‌రు దిగిపోతుంటారు. ఇప్పుడు అర‌వింద స‌మేత‌పై కూడా ఇదే జ‌రుగుతుంది. ఈ సినిమాపై లేనిపోని వివాదాలు రాజేస్తున్నారు. అస‌లు ఈ చిత్రంలో త్రివిక్ర‌మ్ చెప్పింది కొత్త క‌థ కానే కాదు. ఎన్నో ఏళ్లుగా ఉన్న క‌థ‌నే మ‌ళ్లీ చూపించాడు. ఇప్పుడు దీన్ని కూడా వివాదం చేయాల‌ని చూస్తున్నారు కొంద‌రు. త‌మ సీమ ప్రాంతాన్ని అవ‌మానించారంటూ కొంద‌రు మీడియా ముందుకు వ‌చ్చారు. అస‌లు ఇక్క‌డే అంద‌రికీ అనుమానాలు వ‌స్తున్నాయి. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో వ‌చ్చిన తొలి సినిమా అర‌వింద స‌మేత కాదు క‌దా.. ఇప్ప‌టికే వాడివాడి రాసుకున్న క‌థ‌నే మ‌ళ్లీ రాసుకున్నాడు త్రివిక్ర‌మ్. అలాంటి స‌మ‌యంలో ముందు ఎందుకు నోరు మెద‌ప‌లేదు. వ‌యోలెన్స్ మా డిఎన్ఏ అని అవ‌మానించారంటూ బాధ ప‌డుతున్నారు.. భూమిలో క‌త్తులు మొలుస్తాయని డైలాగ్ పెట్టినందుకు ఫీల్ అవుతున్నారు క‌దా మ‌రి 20 ఏళ్లుగా తెలుగు ఇండ‌స్ట్రీలో మిగిలిన ద‌ర్శ‌కులు.. హీరోలు చేసిందేంటి..? ఆ నేల‌పై పూలు పూస్తాయ‌ని చూపించారా..? అలా అయితే చేయ‌లేదు క‌దా..? 

స‌మ‌ర‌సింహారెడ్డి నుంచి మొద‌లుకొని అంతఃపురం, ఇంద్ర‌, ఆది, సాంబ‌, చెన్న‌కేశ‌వ‌రెడ్డి లాంటి ఎన్నో సినిమాల్లో చూపించింది ర‌క్త‌పాత‌మే క‌దా.. ప్రోత్స‌హించింది సీమ క‌క్ష్య‌ల్నే క‌దా..! మ‌రి అలాంటి స‌మ‌యంలో ఇప్పుడు ఎందుకు నోరు లేస్తుంది..? అంటే ఇప్పుడు సోష‌ల్ మీడియా పెరిగింది అనా.. లేదంటే ఇన్నాళ్లూ రాయ‌ల‌సీమ అలా లేదా..? ఇదే ఇప్పుడు వివాదం రేపిన వాళ్ల‌ను కొంద‌రు అడుగుతున్న సూటి ప్ర‌శ్న‌. చిరంజీవి నుంచి బాల‌య్య‌, ఎన్టీఆర్, చివ‌రికి అల్ల‌రి నరేష్ కూడా సీమ గురించి సినిమాలు చేసారు.. అప్పుడు మాట్లాడ‌ని వాళ్లంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు..? అదంతా వ‌దిలేయండి.. 15 ఏళ్ల ఎన్టీఆరే ఆది సినిమా చేసాడు క‌దా.. అప్పుడెందుకు మాట్లాడ‌లేదు..? అందులో కూడా ఆయ‌న ఫ్యాక్ష‌నిస్టే క‌దా..? ఇప్పుడు రాజ‌కీయాల కోసం.. త‌మ స్వ‌లాభం కోస‌మే ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తున్నారా..? ఇప్పుడు ఉన్న‌ట్లుండి ఎందుకు ఇంత‌గా మ‌నోభావాలు దెబ్బ తింటున్నాయి..? మొత్తానికి ఇప్పుడు అర‌వింద స‌మేత వివాదం చూస్తుంటే న‌వ్వొస్తుందే కానీ ఏ కోశానా సీరియ‌స్ నెస్ అయితే క‌నిపించ‌డం లేదు. 

More Related Stories