English   

"మీ టూ" లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 

NTR-Kalyan-Ram
2018-10-15 15:12:14

మీ టూ.. అంటే నేను కూడా.. సమయాన్ని బట్టి దీని అర్థం మారుతుంది. ఇప్పుడు దాని అర్థం ప్రపంచ మంతా ఒకరకంగా ఉంది. కానీ నిఘంటువుతో చూస్తే ఈ మీటూ అనే పదబంధంలో ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరాడు. అతనితో పాటు సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా ఉండటం విశేషం. అయితే ఈ మీటూ ఎవర్నో  ఇబ్బంది పెట్టే గ్రూప్ కాదు. ఆపదలో ఉన్నవారికి సాయం చేసే కార్యక్రమం. యస్.. మొన్న కేరళలో వచ్చిన వరదలకు దేశమంతా మీ టూ అంటూ స్పందించింది. ఇప్పుడు శ్రీకాకుళంలో వచ్చిన వరదల విషయంలో మన స్టార్స్ మీటూ లో మాగ్జిమం ఆచితూచి ‘చెక్కులు’ వేస్తున్నారు. మొదట సంపూర్ణేష్ బాబు ప్రకటించిన యాభైవేల సాయం చూశాకే ఇతర స్టార్స్ ‘మీటూ ఫర్ శ్రీకాకుళం’ అంటూ స్పందిస్తున్నారు. 

సంపూర్ణేష్ బాబు 50వేలు సాయం అందించిన తర్వాత విజయ్ దేవరకొండ 5లక్షలు ప్రకటించాడు. ఈ ఇద్దరూ తెలంగాణవారు కావడం విశేషం. మొత్తంగా వీరి మూమెంట్ తో ఇప్పుడంతా మీటూ ఫర్ శ్రీకాకుళం అంటూ స్పందిస్తున్నారు. ప్రస్తుతం అరవింద సమేవీ వీరరాఘవతో కెరీర్ ఆల్ టైమ్ బెస్ట్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ శ్రీకాకుళం కోసం 15లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాడు. తమ్ముడే కాదు.. మీ టూ అంటూ కళ్యాణ్ రామ్ కూడా 5లక్షలు ప్రకటించాడు. అన్నదమ్ములిద్దరూ శ్రీకాకుళం కోసం 20లక్షలు డొనేట్ చేశారన్నమాట. ఇక సంపూ తర్వాత స్పందిస్తున్నారనే విమర్శలున్నా.. మనస్టార్స్ కూడా ఇప్పుడు సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారీ ఇష్యూపై. 

More Related Stories