English   

రామ్ చరణ్ సినిమా కూడా హిట్టే నా..?

Ram-Charan
2018-10-15 17:19:12

సో.. రామ్ చరణ్ సినిమా కూడా హిట్టే అన్నమాట. అదేం మాట అనుకుంటున్నారా..? ఈ మధ్య టాలీవుడ్ కో కొత్త సెంటిమెంట్ వచ్చింది. నిజానికి ఇది బాధపడాల్సిన విషయం. కానీ సెంటిమెంట్ పాజిటివ్ గా ఉండటంతో చాలామంది బాధపడ్డట్టుగా కనిపించినా ఫైనల్ గా హ్యాపీగానే ఫీలవుతున్నారు. ఆ సెంటిమెంట్  వర్కవుట్ అయితే రామ్ చరణ్ అకౌంట్ లో మరో హిట్ పడుతుంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటో తెలుసా.. రిలీజ్ కు ముందే సినిమాకు సంబంధించి ఏదో ఒకటి లీక్ కావడం. రామ్ చరణ్ కొత్త సినిమాకు సంబంధించి ఇప్పుడు ఫైట్ సీన్ లోని కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎవరు లీక్ చేశారో కానీ.. ఇవి వచ్చిన దగ్గర్నుంచీ చరణ్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.. తమ సినిమా గ్యారెంటీ హిట్ అని. 

ప్రస్తుతం రామ్ చరణ్.. బోయపాటి శ్రీను డైరెక్షన్ లోసినిమా చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తోన్న సినిమా ఇది. భరత్ అనేనేను బ్యూటీ కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక పూర్తిగా బోయపాట స్టైల్లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇంకా టైటిల్ అఫీషియల్ గా కన్ఫార్మ్ చేయని ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలిపే అవకాశాలున్నాయి. వీలైతే ఈ యేడాది చివర్లో వచ్చినా ఆశ్చర్యం లేదు. మొత్తంగా ఓ మార్కెట్ యార్డ్ లో సాగే ఫైట్ కు సంబంధించిన స్టిల్స్ ఇవి. సెంటిమెంట్ తో  హ్యాపీగా ఉన్నా.. నిజంగానే ఇలాంటి లీకులు సహించరానివి. ఇవాళ స్టిల్స్ అయినవి రేపు వీడియోస్ అవుతాయి. అప్పుడు సినిమా వారికే లాస్. అందుకే లీకుల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉంటే బెటర్. 

More Related Stories