English   

బాక్సాఫీస్ ను అదరగొడుతోన్న అరవిందుడు 

Aravinda-Sametha
2018-10-15 18:42:19

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మోస్ట్ క్రేజీయొస్ట్ ప్రాజెక్ట్ అరవింద సమేత వీరరాఘవ. ఊహించినట్టుగానే ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ డే నుంచే బ్లాక్ బస్టర్ టాక్ కూడా రావడంతో కలెక్షన్స్ విషయంలోనూ కుమ్మేస్తున్నాడు అరవిందుడు. కేవలం నాలుగు రోజుల్లోనే రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ నమోదు చేయబోతున్నాడు యంగ్ టైగర్. అటు త్రివిక్రమ్ కు కూడా ఇదే పెద్ద విజయం అనుకోవచ్చు.  ఇప్పటికే వరుసగా నాలుగు సినిమాల ఒకటిన్న మిలియన్ క్లబ్ లో చేరిన ఫస్ట్ సౌత్ హీరోగా తిరుగులేని రికార్డ్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు నాలుగు రోజుల కలెక్షన్స్ లో కూడా అదే ఊపు చూపిస్తూ దూసుకుపోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ నాలుగు రోజుల కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉన్నాయో చూద్దాం.. 

నైజాం    :  13.80 కోట్లు 
సీడెడ్     : 10.95 కోట్లు 
ఈస్ట్     : 4.04 కోట్లు 
వెస్ట్     : 3.32 కోట్లు 
క్రిష్ణా    : 3.52 కోట్లు 
గుంటూర్    : 6.10 కోట్లు 
నెల్లూర్    : 1.80 కోట్లు 
యూఏ    : 5.56 కోట్లు 
తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ :  49. 10 కోట్లు ప్లస్
నాన్ తెలుగు స్టేట్స్ :  7.50 కోట్లు 
ఓవర్శీస్     : 10.70 కోట్లు 

మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్  68. 10 కోట్లు .

అదీ ఎన్టీఆర్ స్టామినా.. వాల్డ్ వైడ్ గా కేవలం నాలుగు రోజుల్లోనే వసూలు చేసిన ‘షేర్’ 68.10 కోట్లు. మరి వరస చూస్తోంటే ఈ మూవీ బయ్యర్స్ కు మంచి లాభాల్నే తెచ్చినట్టు తెలుస్తోంది కదా. 

More Related Stories