English   

హలో గురూ అంతా క్లీన్

Hello-Guru-Prema-Kosame
2018-10-15 19:19:30

రామ్ పోతినేని, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘హలో గురూ ప్రేమకోసమే’. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీకి త్రినాథరావు నక్కిన దర్శకుడు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ దసరా సందర్భంగా ఈ నెల 18న విడుదల కాబోతోన్న హలో గురూ ప్రేమకోసమే సెన్సార్ పూర్తయింది. ఈ మధ్య రామ్ కు సరైన హిట్స్ పడటం లేదు. అటు హీరోయిన్ పరిస్థితీ అంతే. అలాగే నిర్మాత దిల్ రాజు కూడా వరుస వైఫల్యాలతో కాస్త డల్ అయ్యాడు. మొత్తంగా ఈ టీమ్ అందరికీ జోష్ ఇచ్చే సినిమా ఇది అని ముందు నుంచీ స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. కారణం కంటెంట్ పై వారికున్న నమ్మకమేనట.   మొత్తంగా హలో గురూ ప్రేమకోసమే చిత్రానికి సెన్సార్ నుంచి ‘‘క్లీన్ యూ’’ సర్టిఫికెట్ రావడం విశేషం. అంటే సినిమా పూర్తిగా దిల్ రాజు శైలిలోనే ఉండబోతోందని అర్థమైంది. ఇక ఇలాంటి మాసివ్ లవ్ స్టోరీస్ తీయడంలో దర్శకుడు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి.. హలో గురూ ప్రేమకోసమే రామ్ కు ఓ మంచి హిట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ పండగ వీరికి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. 

More Related Stories