English   

పూరీ హీరో టీజ‌ర్ భ‌లే ఉందే..

Bluff-Master
2018-10-15 12:39:00

యంగ్ అండ్ న్యూ టాలెంట్ వెలికి తీయ‌డంలో పూరీ స్టైల్ అంద‌రికీ తెలుసు. అలా అత‌ను ఇన్వెంట్ చేసిన మ‌రో టాలెంట్.. స‌త్య‌దేవ్. అంత‌కు ముందు చిన్న‌చిన్న పాత్ర‌లు వేస్తోన్న స‌త్య‌దేవ్ ను హీరోగా పెట్టి అత‌ను తీసిన జ్యోతిల‌క్ష్మి తీశాడు. ఆ త‌ర్వాత మా ఊరి రామాయ‌ణంలోనూ మంచి ప్ర‌తిభ‌నే చూపించాడు. దీంతో కుర్రాడు ఎక్క‌డికో వెళ‌తాడు అనుకున్నారు చాలామంది.బ‌ట్ స‌త్యదేవ్ జ‌ర్నీ అనుకున్నంత స్పీడ్ గా సాగ‌లేదు.

.

మొత్తంగా కాస్త లేట్ అయినా... ఇప్పుడు హీరోగా వ‌స్తున్నాడు. బ్ల‌ఫ్ మాస్ట‌ర్ అనే సినిమాతో అత‌ను హీరోగా వ‌స్తున్నాడు. ఈ మూవీ టీజ‌ర్ విడుద‌లైంది.  త‌మిళంలో మంచి విజ‌యం సాధించిన చ‌తురంగ‌వేట్టై అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీలో హీరో కాస్త ర‌గ్గ్ డ్ గా క‌నిపిస్తాడు. అది స‌త్య‌దేవ్ కు బాగా స‌రిపోతుంది. ఇక లేటెస్ట్ గా విడుద‌లైన టీజ‌ర్ ఆక‌ట్టుకుంటోంది. స‌త్క‌య‌దేవ్ స‌ర‌స‌న నందితశ్వేతా హీరోయిన్ గా న‌టించింది. టీజ‌ర్ లో ని డైలాగ్స్ కు ఎవ‌రైనా ఫిదా కావాల్సిందే అన్న‌ట్టుగా ఉన్నాయి. గోపీ గ‌ణేశ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఆదిత్య మీన‌న్, బ్ర‌హ్మాజీ, ప్రుథ్వీ, సిజ్జు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మొత్తంగా ఈ టీజ‌ర్ పై సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.

More Related Stories