English   

అర‌వింద స‌మేత ఎక్క‌డ ఆగుతుంది..? 

Aravinda-Sametha
2018-10-16 11:11:32

మొద‌టి రోజు విడుద‌లైన‌పుడు సినిమా ఈ రేంజ్ లో ఉంటుంద‌ని.. ఇంత‌గా వ‌సూలు చేస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. కానీ ఇప్పుడు అర‌వింద స‌మేత అనుకున్నంతా చేస్తున్నాడు. ఎక్క‌డ మొద‌లు పెట్టి ఎక్క‌డాపాలో కూడా తెలియ‌నంత అరాచ‌కాలు చేస్తున్నాడు. ఒక్కోరోజు పెరుగుతుంటే కోట్లు కూడా పెరుగుతున్నాయి. మూడు రోజుల్లోనే 100 కోట్లు వ‌సూలు చేసిన వీర‌రాఘ‌వ‌.. ఐదో రోజు కూడా సంచ‌ల‌నం సృష్టించాడు. సెలవుల‌ను పూర్తిగా వాడేసుకుంటూ ఈ చిత్రం 5 రోజుల్లోనే 76 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. ఇంకా 16 కోట్లు వ‌సూలు చేస్తే చాలు సినిమా సేఫ్ జోన్ కు వ‌చ్చేస్తుంది. విడుద‌ల‌కు ముందు 93 కోట్లు అంటే ఎంత క‌ష్టం అనుకున్నారు కానీ ఇప్పుడు చాలా ఈజీగా ఇది చేసి చూపిస్తున్నాడు ఎన్టీఆర్. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్ప‌టికే 50 కోట్లు దాటేసింది ఈ చిత్రం. ద‌స‌రా సెల‌వులు మ‌రో వారం రోజులు ఉన్నాయి. ఈ దూకుడు ఇలాగే కానీ సాగితే ఈజీగా 110 కోట్ల వ‌ర‌కు సినిమా వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఈ వారం హ‌లో గురు ప్రేమ‌కోస‌మేతో పాటు పందెంకోడి 2 సినిమాలు వ‌చ్చినా కూడా అర‌విందుడు దూకుడు త‌గ్గ‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే సినిమా టాక్ కూడా ప్రేక్ష‌కుల్లోకి బాగుంద‌నే వెళ్లింది. దాంతో కుటుంబాలు కూడా ఈ సినిమాకు క‌దులుతున్నాయి. మ‌రి చూడాలిక‌.. ఈ జోరు మ‌ధ్య అర‌వింద స‌మేత సంచ‌ల‌నం ఎక్క‌డ ఆగుతుందో..? 

More Related Stories